Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

07-Jul-2017 11:42:09
facebook Twitter Googleplus
Photo

అనుష్క తన కెరీర్ ప్రారంభం నుంచి హీరోయిన్ గా కొనసాగుతూనే మధ్యమధ్యలో స్పెషల్ ఐటెం సాంగ్స్ లో కూడా కనిపిస్తోంది. తమిళ్ లో పలు చిత్రాల్లో ఇలా నటించిన స్వీటీ.. తెలుగులో మాత్రం కేవలం పాట కోసమే అయితే.. అప్పట్లో మెగాస్టార్ తో కలిసి స్టాలిన్ మూవీలో ఐ వాంట్ స్పైడర్ మ్యాన్ అనే పాటలో కనిపించింది. ఆ తర్వాత నాగ్ సినిమాల్లో మినహాయిస్తే.. చిన్ని చిన్ని పాత్రల్లో కనిపించిన దాఖలాలు చాలా తక్కువ.

మళ్లీ ఇప్పడు అనుష్కతో ఓ ఐటెం సాంగ్ చేయించే ఆలోచన చేస్తున్నారట. ప్రస్తుతం స్పైడర్ పూర్తి చేసి.. భరత్ అను నేను చిత్రాన్ని ప్రారంభించేస్తున్నాడు మహేష్ బాబు. కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ మూవీలో.. ఓ స్పెషల్ ఐటెం సాంగ్ ను ప్లాన్ చేశాడట దర్శకుడు. ఈయన గత చిత్రం జనతా గ్యారేజ్ లో కాజల్ తో చేయించిన పక్కా లోకల్ టైపులో ఈ పాట ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడట. ఈ పాటలో ఐటెం గాళ్ గా స్వీటీ అనుష్కను చూపించాలని ప్రయత్నాలు జరుగుతున్నట్లు తెలుస్తోంది.

మరి అనుష్కను అప్రోచ్ అయ్యారా.. కెరీర్ ఈ స్టేజ్ లో ఇందుకు ఆమె ఒప్పుకుంటుందా లేదా అన్న విషయం ఇప్పుడే చెప్పలేం. కానీ మహేష్ తో అనుష్క కాంబినేషన్ లో వచ్చిన ఖలేజా.. థియేటర్లలో ఆడకపోయినా.. స్మాల్ స్క్రీన్ పై ఇప్పటికీ ఆకట్టుకుంటూనే ఉంటుంది.

,  ,  ,  ,  ,