Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

24-Jul-2017 15:22:26
facebook Twitter Googleplus
Photo

ప్రభాస్ ఈ సారి పూర్తిస్థాయి యాక్షన్ ఎంటర్ టెయినర్ చేస్తున్నాడు. రన్ రాజా రన్ ఫేం దర్శకుడు సుజిత్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. తెలుగు - తమిళం - హిందీ భాషల్లో ఒకేసారి ఈ సినిమా తెరకెక్కుతోంది. బాలీవుడ్ నటుడు నీల్ నితిన్ ముఖేష్ విలన్ గా నటిస్తున్న ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే స్టార్ట్ చేశారు. రెగ్యులర్ షూటింగులకు ప్రభాస్ కొద్దిరోజుల్లో రానున్నాడు.

భారీ బడ్జెట్ తో తీస్తున్న సాహో సినిమా విషయంలో ఇప్పటి వరకు ఫైనలైజ్ అవనిది ఒక్క హీరోయిన్ మాత్రమే. బాహుబలితో బాలీవుడ్ లో ఏర్పడిన క్రేజ్ ను దృష్టిలో పెట్టుకుని దీపికా పదుకునే - ఆలియాభట్ వంటి టాప్ హీరోయిన్లను తీసుకుందామని భావించినా వెనక్కు తగ్గారు. దీంతో హిట్ పెయిర్ గా పేరు తెచ్చుకున్న అనుష్కనే హీరోయిన్ గా నటించనుందని టాక్ వచ్చింది. కానీ లేటెస్ట్ న్యూస్ ఏమిటంటే స్వీటీ సాహోలో నటించడం లేదు. ప్రస్తుతం తన డెయిరీ ఖాళీగా లేదని ఇప్పటికిప్పుడు కాల్షీట్లు ఇవ్వడం కష్టమని తేల్చిచెప్పేసిందట. అదీగాక సాహో కోసం అడుగుతున్న డేట్లు ఓ తమిళ్ సినిమాకు ఆల్రెడీ ఇచ్చేసినందున ఆ సినిమాలో నటించడం కుదరదని స్వీటీ కన్ఫర్మ్ చేసిందనేది టాక్.

అనుష్క ఇంతవరకు బిల్లా - మిర్చి - బాహుబలి సినిమాల్లో ప్రభాస్ పక్కన నటించింది. ఈ మూడు సూపర్ హిట్ కావడంతో పాటు వారిద్దరి కాంబినేషన్ కు మంచి పేరొచ్చింది. మరోసారి ఆ కాంబినేషన్ రిపీట్ అవుతుందని అంతా అనుకున్నా దానికి బ్రేక్ పడింది.

,  ,  ,  ,  ,