Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

05-Oct-2015 15:59:41
facebook Twitter Googleplus
Photo

సింగం సిరీస్ కోలీవుడ్ - టాలీవుడ్ లో టాప్ హిట్ సిరీస్ గా పేరు తెచ్చుకుంది. సింగం - సింగం 2 ఇప్పటికే తమిళంలో పెద్ద విజయాలు సాధించాయి. తెలుగులో సింగం బ్లాక్ బస్టర్ హిట్. సింగం 2 యావరేజ్ చిత్రంగా నిలిచాయి. ఇప్పుడు ఇదే సరీస్ లో మూడో భాగం తెరకెక్కుతోంది. సూర్య సరసన అనుష్క - శ్రుతిహాసన్ కథానాయికలుగా నటిస్తున్నారు. ఎప్పటిలానే ఈ సినిమాలో అనుష్క ప్రధాన నాయిక. రెండో నాయికగా శ్రుతిహాసన్ అందాలు ఆరబోయడానికి రెడీ అవుతోంది. ఈ సంగతిని అనుష్క కన్ఫమ్ చేసింది.

''సింగం ఫ్రాంఛైజ్ లో నాయికగా కొనసాగుతున్నా. ఇప్పటికే సూర్య నేను కలిసి నటించాం. ఒకసారి కలిసి పనిచేసిన టీమ్ తో పనిచేయడం అంటే చాలా సౌకర్యంగా ఉంటుంది'' అని చెప్పింది స్వీటీ. ఆర్యతో ఎఫైర్ మాటేమిటి? అని ప్రశ్నిస్తే .. ఇలాంటివన్నీ మామూలే. ఒక్క ఆర్యతోనే కాదు అందరు హీరోలతోనే లింకులు పెట్టి ప్రచారం చేస్తున్నారు. ఒక్క రానాతో తప్ప. రానాని బ్రదర్ అని పిలుస్తాను. తను నన్ను సిస్టర్ అని పిలుస్తాడు. అందువల్ల ఆగిపోయారేమో.. అంటూ తిరిగి రివర్స్ పంచ్ వేసింది స్వీటీ.

లేడీ సూపర్ స్టార్ అని మిమ్మల్ని పిలవొచ్చా? అన్న ప్రశ్నకు .. అలా పిలవడం ఇష్టం లేదు. నాకంటే ముందే 30 ఏళ్ల నుంచి ఆ బిరుదుతో గౌరవం అందుకున్నవారున్నారు. నేను చేసింది 5శాతమే. ఒకవేళ మరో పాతికేళ్లు ఇలానే నటిస్తే అప్పుడు పిలవొచ్చు.. అని అంది. సైజ్ జీరో రిలీజ్ ఎప్పుడు? అన్న ప్రశ్నకు.. దానిగురించి మరీ అంతగా వర్రీ అవ్వడం లేదని ముక్తాయించింది. అదీ మ్యాటరు.

,  ,  ,  ,  ,