Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

21-Jun-2016 11:22:23
facebook Twitter Googleplus
Photo

బాలీవుడ్ హీరోయిన్లకు హాలీవుడ్ అవకాశాలు రావడం.. వాటిని ఒడిసిపట్టుకుని అందలం ఎక్కడం అంత సులువేం కాదు. కానీ ప్రియాంక చోప్రా - దీపికా పదుకొనేలు మాత్రం హాలీవుడ్ లో పాగా వేయబోతున్నారనే విషయం తెలిసిపోతోంది. పీసీ ఇప్పటికే మకాం మార్చేయగా.. ట్రిపుల్ ఎక్స్ తర్వాత దీపిక కూడా అదే బాట పట్టే ఛాన్స్ ఉంది. అయితే తాను మాత్రం హాలీవుడ్ సినిమాలపై మనసు పెంచుకోలేదని.. అక్కడికి వెళ్లే ఛాన్స్ లేదని చెప్పేసింది అనుష్క శర్మ.

'నేనో యాక్ట్రెస్ గా ఉండాలంతే. అవకాశాలు ఎక్కడి నుంచి వచ్చినా పర్లేదు. ఆ రోల్ నాకు ఇంట్రెస్టింగ్ గా ఉందంటే చేస్తాను. ఎక్కడికో వెళ్లిపోయి ఓ మూస పద్ధతిలో ఇండియన్ గాళ్ కేరక్టర్లు చేయాలని అనుకోవడం లేదు. నేనేదైనా చేయాలంటే నాకు ఆసక్తి కలగాలి. ప్రియాంక - దీపికలు చాలా చేస్తున్నారు. వారు పవర్ ఫుల్ అమ్మాయిలు' అంటూ వివాదంలో ఇరుక్కోకుండా జాగ్రత్త పడింది అనుష్క శర్మ.

'వారు మన దేశానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఇక్కడున్న చాలామందికి ఎన్నో అవకాశాలు రావడానికి కారణమవుతున్నారు. అది మంచి పనే అయినా.. నేను ఆ రూట్ లో వెళ్లలేను' అంటూ తేల్చి చెప్పేసింది అనుష్క శర్మ.

,  ,  ,  ,  ,  ,