Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

05-Dec-2017 12:59:21
facebook Twitter Googleplus
Photo

వెంకటేష్ కొత్త సినిమా ప్రారంభమయిపోయింది. గురు చిత్రం తర్వాత దాదాపు 8 నెలలు బ్రేక్ తీసుకున్న వెంకీ.. ఇప్పుడు తేజ దర్శకత్వంలో కొత్త చిత్రాన్ని స్టార్ట్ చేసేశారు. ఆట నాదే వేట నాదే అంటూ ఈ మూవీకి టైటిల్ డిసైడ్ చేశారనే టాక్ వినిపిస్తోంది.

ఈ సినిమాలో వెంకీ సరసన హీరోయిన్ గా ఎవరు నటించనున్నారనే ఆసక్తి కనిపిస్తోంది. గత కొన్నేళ్లుగా సీనియర్ హీరోలకు హీరోయిన్స్ దొరకడం కష్టం అవుతుందని ఈ విక్టరీ హీరో స్వయంగా ఒప్పుకున్నాడు. బాబు బంగారం విషయంలో కూడా ప్రమోషన్స్ కు రావడం కుదరదని నయనతార ముందే చెప్పినా.. ఒప్పుకుని మరీ సినిమా చేశామన్నాడు వెంకీ. ఇప్పుడు తేజ దర్శకత్వంలో తెరకెక్కే చిత్రం కోసం.. హీరోయిన్ ను ఫైనల్ చేశారనే టాక్ వినిపిస్తోంది. బాహుబలిలో దేవసేనగా అందరినీ అలరించి మెప్పించిన అనుష్క.. ప్రస్తుతం భాగమతి మూవీ రిలీజ్ కోసం ఎదురుచూస్తోంది.

కొంతకాలంగా తన సైజుతో ఇబ్బంది పడుతున్న ఈ భామ.. రీసెంట్ గా తను సన్నబడ్డ విషయాన్ని ఓ ఫోటో ద్వారా వెల్లడించింది. ఈ చక్కనైన చిక్కిన అందాన్ని వెంకటేష్ సినిమాలో హీరోయిన్ గా తీసుకున్నారనే ప్రచారం జరుగుతోంది. గతంలో వీరిద్దరూ కలిసి చింతకాయల రవి.. నాగవల్లి చిత్రాల్లో నటించారు.

,  ,  ,  ,  ,