Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

22-Aug-2017 15:08:04
facebook Twitter Googleplus
Photo

నిన్నట్నుంచి ప్రచారంలో ఉన్న వార్తలే నిజమయ్యాయి. మెగాస్టార్ కొత్త సినిమా టైటిల్ ఉయ్యాలవాడ నరసింహారెడ్డి కాదు. ఈ చిత్రానికి సై రా అనే టైటిలే ఫిక్స్ చేశారు. దీనికి నరసింహారెడ్డి అనేది క్యాప్షన్ గా పెట్టారు. ఈ సినిమాకు పని చేస్తున్న సాంకేతిక నిపుణుల గురించి కూడా పోస్టర్లో క్లారిటీ ఇచ్చారు. ఐతే టెక్నీషియన్లందరిలోకి ఎగ్జైట్మెంట్ కలిగించే పేరు ఎ.ఆర్.రెహమాన్దే అనడంలో సందేహం లేదు.

రెహమాన్కు సురేందర్ రెడ్డి కథ చెప్పి ఒప్పించినట్లుగా నెల రోజుల కిందటే వార్తలొచ్చాయి కానీ.. రెహమాన్ నిజంగా ఒప్పుకుంటాడా అన్న నమ్మకం కుదర్లేదు జనాలకు. ఇందుకు కారణం లేకపోలేదు. తనకంటూ ఒక ఇమేజ్ వచ్చాక రెహమాన్ ఓ తెలుగు దర్శకుడు రూపొందస్తున్న తెలుగు సినిమాకు పని చేయలేదు. కెరీర్ ఆరంభంలో నిప్పు రవ్వ కు బ్యాగ్రౌండ్ స్కోర్ అందించడం.. పల్నాటి పౌరుషం - సూపర్ పోలీస్ లాంటి మామూలు సినిమాలకు మ్యూజిక్ ఇచ్చాడు తప్ప.. సంగీత దర్శకుడిగా స్టార్ ఇమేజ్ సంపాదించాక ఏ తెలుగు దర్శకుడు చేసిన తెలుగు సినిమాకూ రెహమాన్ పని చేయలేదు.

,  ,  ,  ,  ,