Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

28-Nov-2017 11:14:48
facebook Twitter Googleplus
Photo

అర్జున్ రెడ్డి సినిమా టాలీవుడ్ లో ఎలాంటి సెన్సేషన్ ని క్రియేట్ చేసిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కేవలం ట్రైలర్ తోనే ఎన్నో అంచనాలను తెచ్చుకున్న ఆ సినిమా బాక్స్ ఆఫీస్ ని బద్దలు కొట్టింది. దాదాపు 50 కోట్లు గ్రాస్ ను రాబట్టి అందరికి లాభాన్ని చేకూర్చింది. అయితే సినిమాపై ఆరోపణలు వచ్చిన విషయం గురించి కూడా తెలిసిందే. ముఖ్యంగా ఏం మాట్లాడుతున్నావ్ రా.. అనే డైలాగ్ పై కొందరు ప్రముఖులు కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు.

అయితే జనాలు మాత్రం ఆ సినిమాకి - హీరోకి పెద్ద ఫ్యాన్స్ అయిపోయారు. కేవలం సినిమాను సినిమాలనే చూడాలని కౌంటర్లు కూడా వేశారు. అయితే యాంకర్ అనసూయ మాత్రం రివర్స్ లో ఆ బూతు పదం ఏమిటని డిబేట్ లు నిర్వహించింది. దీంతో అందరు ఆమెపై విమర్శలు చేయడం మొదలు పెట్టారు. అయినా కూడా అనసూయ ఆ బూతు పదంపై ఆరోపణలు చేసింది. ఇక రీసెంట్ ఆమె చేస్తోన్న షోపై వివాదాలు చెలరేగుతోన్న సంగతి తెలిసిందే. కమెడియన్ ఆది.. అనాదలపై వేసిన ఒక సెటైర్ గురించి ప్రస్తుతం సీరియస్ గా చర్చలు నడుస్తున్నాయి.

అయితే అనసూయ దీనిపై స్పందించి బురద చల్లుకున్నట్టు అయ్యింది. ఆమె ఏం చెప్పిందంటే.. అది ఒక కామెడీ స్కిట్.. జస్ట్ ఫన్గానే చూడాలి అనడంతో.. సోషల్ మీడియాలో అర్జున్ రెడ్డి అభిమానులు కౌంటర్లు వేశారు. మరి అర్జున్ రెడ్డిపై చాలా విమర్శలు చేశావు కదా.. అది ఒక సినిమా అని తెలియదా అని కౌంటర్ వేశారు. సోషల్ మీడియాలో అర్జున్ రెడ్డి ఫ్యాన్స్ గ్రూప్స్ చాలానే ఉన్నాయి.

,  ,  ,  ,  ,