Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

11-Aug-2016 17:02:57
facebook Twitter Googleplus
Photo

సౌత్ సినిమా పరిశ్రమలో ప్రయోగాలకు చిరునామాగా చెప్పుకునే నటుడు చియాన్ విక్రమ్. శివపుత్రుడు, అపరిచితుడు, ఐ వంటి చిత్రాలతో ఉత్తమ నటుడిగా గుర్తింపు పొందిన విక్రమ్ తాజాగా నటిస్తున్న చిత్రం ఇంకొక్కడు. ఆనంద్ శంకర్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో విక్రమ్ సరసన ?నయనతార, నిత్యామీనన్? లు హీరోయిన్లుగా నటిస్తున్నారు.
తమిళంలో ఇరుముగన్? గా విడుదలవుతున్న ఈ చిత్రాన్ని తెలుగులో ?ఇంకొక్కడు? పేరుతో ఆర్. కే ఫిలిమ్స్ ?నీలం కృష్ణా రెడ్డి? విడుదల చేస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్ర తమిళ ఆడియో, ట్రైలర్లు విడుదలై మంచి స్పందన తెచ్చుకోగా తెలుగు వర్షన్ ఆడియో, ట్రైలర్ ను జె.ఆర్‌.సి. క‌న్వెక్ష‌న్ సెంటర్లో ఆగష్టు 15న విడుదల చేయనున్నారు. ఈ చిత్రానికి ?హరీశ్ జయరాజ్? సంగీతాన్ని అందించారు.

,  ,  ,  ,  ,  ,  ,