Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

03-Oct-2016 16:39:31
facebook Twitter Googleplus
Photo

దర్శకుడిగా తన మొదటి రెండు సినిమాలతో హిట్స్ సాధించిన ఊపులో ఉన్నాడు శ్రీనివాస్ అవసరాల. హ్యూమన్ ఎమోషన్స్ కు తెలుగుదనాన్ని అద్ది.. విజయాలు సాధిస్తున్న ఈ ఎన్నారై డెరెక్టర్ కి.. ఇప్పుడు బోలెడంత క్రేజ్ ఉంది. ముచ్చటగా మూడో సినిమాని కూడా హిట్ చేసేసి.. తన స్థానాన్ని పర్మినెంట్ చేసేసుకోవాలనే పట్టుదలతో ఉన్న అవసరాల.. నానితో చేద్దామనే ఐడియాలో ఉన్నాడని గతంలోనే చెప్పేసుకున్నాం.

అవసరాలతో సినిమాకి నాని కూడా సై అన్నాడు కానీ.. ఈ ప్రాజెక్టు పట్టాలెక్కడానికి ఎంత టైమ్ పడుతుందన్నదే ప్రశ్నార్ధకం. ప్రస్తుతం నాని చేతిలో 5-6 ప్రాజెక్టులు ఉన్నాయి. అయితే.. ఏడాదికి 3-4 సినిమాలు చేసేస్తూ స్పీడ్ చూపిస్తున్న నేచురల్ స్టార్.. ఓ ఏడాది తర్వాత అవసరాల సినిమాకు కమిట్ అవచ్చని అంచనా. అందుకే.. ఈ లోగా ఓ సినిమా కంప్లీట్ చేద్దామని అనుకుంటున్న ఈ దర్శకుడు.. వెంకటేష్ తో సినిమా చేయాలని భావిస్తున్నాడట. ఇందుకు తగ్గట్లుగానే కథ-కథనం రాసుకుంటున్నాడని తెలుస్తోంది.

ఇప్పటివరకూ వెంకీ దగ్గరకు ప్రపోజల్ వెళ్లకపోయినా.. అవసరాల స్టోరీ వెంకీకి సరిపోయేదిగానే ఉండనుందిట. అయితే.. కేవలం కామెడీని మాత్రమే నమ్ముకోకుండా.. తనకు అలవాటైన అచ్చొచ్చిన.. హ్యూమన్ ఎమోషన్స్ ని మిక్స్ చేయనున్నాడని తెలుస్తోంది. వెంకీని సోలో హీరోగా కాకుండా.. మరో ఇద్దరు ముగ్గురు కుర్ర హీరోలతో కలిపి మల్టీ స్టారర్ చేయనున్నాడన్నది ఫిలింనగర్ టాక్.

,  ,  ,  ,  ,