Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

21-Jun-2016 16:22:30
facebook Twitter Googleplus
Photo

`మిణుగురులు` వంటి విల‌క్ష‌ణ‌మైన చిత్రాన్ని తెర‌కెక్కించిన ద‌ర్శ‌కుడు అయోధ్య‌కుమార్ ద‌ర్శ‌క‌త్వంలో మ‌రో కొత్త చిత్రం `శ్రీల‌క్ష్మి & 24 కిస్సెస్‌` ప్రారంభం కానుంది. ఇది ఒక మంచి యూనిక్ ల‌వ్‌స్టోరీ, ఎమోష‌న‌ల్ ఎంట‌ర్‌టైనర్‌. ఓ ప్ర‌ముఖ నిర్మాన సంస్థ నిర్మించ‌నున్న ఈ చిత్రంలో ఓ ప్ర‌ముఖ హీరో, హీరోయిన్ న‌టించ‌నున్నారు. ఈ సంద‌ర్భంగా అయోధ్య‌కుమార్ మాట్లాడుతూ ```శ్రీల‌క్ష్మి & 24 కిస్సెస్‌` అనే టైటిల్ కొంచెం హార్డ్‌గా ఉండొచ్చు లేదా ఆస‌క్తిగానూ ఉండ‌వ‌చ్చు కానీ ఇది ప్యూర్ ల‌వ్ స్టోరీ. ఇప్ప‌టి వ‌ర‌కు తెలుగులో ఇటువంటి ఎంట‌ర్‌టైన్మెంట్ రాలేదు. ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ ఈ చిత్రాన్ని రూపొందించ‌నుంది. ప్రముఖ హీరో హీరోయిన్స్ న‌టించ‌నున్నారు. అలాగే సాంకేతిక వ‌ర్గం ఈ సినిమాకు ప‌నిచేస్తున్నారు. యూత్ స‌హా అన్నీ వ‌ర్గాల‌కు న‌చ్చేలా సినిమా ఉంటుంది. ప్ర‌స్తుతం. ప్రీ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు జ‌రుగుతున్నాయి. మిగిలిన టెక్నిషియ‌న్స్ వివ‌రాల‌ను త్వ‌ర‌లోనే తెలియ‌జేస్తాం. సినిమా చిత్రీక‌ర‌ణ జూలై మొద‌టి లేదా రెండో వారంలో స్టార్ట‌వుతుంది`` అన్నారు.
జూన్ 22న ద‌ర్శ‌కుడు అయోధ్య‌కుమార్ పుట్టిన‌రోజును సెల‌బ్రేట్ చేసుకుంటున్నారు.

,  ,  ,  ,  ,  ,