Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

18-Apr-2017 11:28:02
facebook Twitter Googleplus
Photo

టాలీవుడ్ ప్రేక్షకులతో పాటు దేశవ్యాప్తంగా ఆడియన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న మూవీ బాహుబలి ది కంక్లూజన్. ఈ నెల 28న బాహుబలి2 విడుదల చేయనుండగా.. ఇప్పుడీ మూవీ తెలుగు వెర్షన్ కు సెన్సార్ కార్యక్రమాలు పూర్తయినట్లు తెలుస్తోంది.

ఏప్రిల్ 17న బాహుబలి2 మూవీకి సెన్సార్ పూర్తి చేశారట యూనిట్. ఈ విషయంపై ఇంకా అధికారిక ప్రకటన మాత్రం రాజమౌళి అండ్ టీం చేయలేదు. సెన్సార్ పై కనీసం సమాచారం కూడా బయటకు చెప్పలేదు. అయితే.. బాహుబలి2కి మాత్రం సెన్సార్ అయిపోయిందని.. వారి నుంచి యూ/ఏ సర్టిఫికేట్ అందుకున్నారని తెలుస్తోంది. మొదటి భాగం కంటే ఎన్నో రెట్లు అద్భుతంగా బాహుబలి2 ఉండనుందిట. 250 కోట్లకు పైగా బడ్జెట్ తో రూపొందిన ఈ రెండో భాగం.. టాలీవుడ్ లోనే కాదు దేశవ్యాప్తంగా ఎన్నో కొత్త రికార్డులను నమోదు చేయనుందనే టాక్ వినిపిస్తోంది. అయితే.. బాహుబలి2 సెన్సార్ విషయాన్ని బైటకు చెప్పకపోవడానికి వేరే కారణం ఉందంటున్నారు.

ఈ చిత్రాన్ని తెలుగుతో పాటు.. తమిళ్.. మలయాళం.. హిందీల్లో కూడా విడుదల చేయబోతున్నారు. ఆయా భాషల సెన్సార్ బోర్డుల నుంచి క్లియరెన్స్ కోసం వెయిట్ చేస్తున్నారట. అన్నీ వచ్చేసిన తర్వాత.. ఒకేసారి గ్రాండ్ గా అనౌన్స్ చేయాలని చూస్తున్నారని అంటున్నారు.

,  ,  ,  ,  ,