Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

26-Apr-2017 12:51:29
facebook Twitter Googleplus
Photo

బాహుబలి 2 విడుదలకి కి ఇంకా కొద్ది రోజులు మాత్రమే ఉంది. అందుకోసం బాహుబలి టీమ్ మార్కెటింగ్ ట్రిక్స్ ఉపయోగించి సక్సెస్ స్థాయి పెంచడానికి శతవిధాలా ప్రయత్నిస్తున్నారు. బాహుబలి మొదటి భాగానికి బోలెడంత పబ్లిసిటీ హంగామా చేసిన టీం.. ఇప్పుడు ఆ స్థాయిలో కాకపోయినా.. ప్రచార జోరు బాగానే పెంచారు.

బాహుబలి2 ఏప్రిల్ 28న దేశవ్యాప్తంగా 7000కు పైగా స్క్రీన్ లలో విడుదల కానుంది. తెలుగు వెర్షన్ 3000 స్క్రీన్లు.. తమిళ్- మలయాళం- హిందీ వెర్షన్లను 4000 స్క్రీన్ లతో విడుదల చేయనున్నారని చెబుతున్నారు. అయితే ట్రేడ్ పండితులు మాత్రం.. ఇది ఒక పెద్ద నెంబర్ మ్యాజిక్ అని తేల్చేస్తున్నారు. ఇంత వరకు ఏ పెద్ద సినిమా అయనా 5000 స్క్రీన్ లకు మించి విడుదల కాలేదని.. .అన్నీ స్క్రీన్ లు ఒక్క సినిమాకు ఇచ్చేటంత మన దేశంలో థియేటర్లు కూడా లేవని అంటున్నారు. అయితే.. ఈ సినిమాకు ఉన్న క్రేజ్ కారణంగా.. మహా అయితే 5000 స్క్రీన్ దొరుకుతాయి అని అంటున్నారు.

ఇప్పటికే బాహుబలి స్క్రీనింగ్ విషయం లో ఆంధ్ర ప్రదేశ్ తెలంగాణ ప్రభుత్వాలు డైలీ షోస్ ను పెంచుకునేందుకు అనుమతుసలు ఇచ్చాయి

,  ,  ,  ,  ,