Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

10-Apr-2017 14:00:58
facebook Twitter Googleplus
Photo

మా సినిమానే గొప్ప అనే ఫీలింగ్ బాగా ఉన్న ఇండస్ట్రీ కోలీవుడ్డే. వాళ్లు పరభాషా చిత్రాల్ని అంతగా పట్టించుకోరు. హిందీ సినిమాల్ని మనం ఓన్ చేసుకున్నట్లు.. తమిళ డబ్బింగ్ సినిమాల్ని మనం రిసీవ్ చేసుకున్నట్లు వాళ్లు చేయరు. అలాంటిది బాహుబలి విషయంలో మాత్రం వాళ్ల ఆలోచన మారిపోయింది. ఈ చిత్రాన్ని తెలుగు వాళ్లు ఎలా రిసీవ్ చేసుకున్నారో.. తమిళ ప్రేక్షకులు కూడా అలాగే ఆదరించారు. బాహుబలి తెలుగు సినిమా అన్న భావనే వారిలో కనిపించలేదు. తమిళనాట ఈ చిత్రం అనూహ్యమైన వసూళ్లు సాధించింది. రెండో పార్ట్ కోసం తమిళ ప్రేక్షకులు కూడా ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు.

తమిళ జనాల్లో బాహుబలి-2 పై ఏ స్థాయిలో ఆసక్తి ఉంది అనడానికి అక్కడ ఆదివారం జరిగిన ఆడియో వేడుకే నిదర్శనం. ఆ వేడుకతో పోలిస్తే.. రామోజీ ఫిలిం సిటీలో జరిగిన తెలుగు ఆడియో ఫంక్షణ్ రేంజ్ చాలా తక్కువ అని చెప్పాలి. తెలుగు ఆడియో వేడుకకు పది వేల మంది మాత్రమే వచ్చారు. ఏర్పాట్లు కూడా కూడా అందుకు తగ్గట్లే చేశారు. కానీ తమిళ ఆడియో వేడుకను వైఎంసీఏ స్టేడియంలో చాలా పెద్ద ఎత్తున చేశారు. ఈ వేడుకకు హాజరైన అభిమానుల సంఖ్య లక్ష దాటింది. ఇక తమిళ ఇండస్ట్రీకి చెందిన అతిరథ మహారథులు ఈ వేడుకకు వచ్చారు. స్టార్ హీరో ధనుష్.. టాప్ ప్రొడ్యూసర్ థాను.. మ్యూజిక్ డైరెక్టర్ యువన్ శంకర్ రాజా సహా ఎందరో వేడుకలో పాల్గొన్నారు. స్టేజ్ సెట్.. అతిథుల కోసం చేసిన ఏర్పాట్లు.. నృత్య ప్రదర్శనలు.. ఇలా ఏది చూసినా చాలా గ్రాండ్ గా కనిపించింది. మామూలుగా తమిళ ఆడియో వేడుకలకు ఇంత హంగామా ఉండదు. ఏదైనా హోటల్లో సింపుల్ గా కానిచ్చేస్తారు. కానీ బాహుబలి ని మాత్రం చాలా ప్రత్యేకంగా తీసుకున్నారు. బాహుబలి-1 తో భారీగా ఆదాయం పొందిన నిర్మాత చాలా ఉత్సాహంగా ఈ ఏర్పాట్లు చేసినట్లున్నాడు. ఇదంతా చూసి బాహుబలి బృందం షాకైపోయింది. తమ చేతుల మీదుగా జరిగిన తెలుగు ఆడియో వేడుకతో పోలిస్తే ఇది చాలా గ్రాండ్ గా ఉందని వాళ్లు ఫీలయ్యారు. ఆ ఏర్పాట్లు.. అభిమానుల స్పందన చూసి రాజమౌళి సహా అందరూ ఆశ్చర్యపోయారు.

,  ,  ,  ,  ,  ,  ,