Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

13-Jul-2016 10:54:16
facebook Twitter Googleplus
Photo

భారతీయ సినీ చరిత్రలో ఒక అద్భుతంగా నిలిచిపోయి తెలుగు సినీ పరిశ్రమకు అంతర్జాతీయ గుర్తింపును తెచ్చిన సినిమా ?బాహుబలి?. ప్రస్తుతం రాజమౌళి అండ్ టీమ్ ఈ సినిమాకు సీక్వెల్ గా బాహుబలి ? 2 ను తెరకెక్కించే పనిలో బిజీగా ఉన్నారు. ఈ చిత్రం తాలూకు పనులు కూడా శరవేగంగా జరుగుతున్నాయి.
ఇదిలా ఉంటే బాహుబలి ఫ్రాంచైజీలు త్వరలో ఓ వినూత్న ప్రచారాన్ని మొదలుపెట్టనున్నారు. బాహుబలి సినిమాలోని పాత్రలను ఆధారంగా చేసుకుని బొమ్మలు, వీడియో గేమ్స్, ఇతర సేకరించదగ్గ వస్తువులను మార్కెట్లోకి తీసుకురానున్నారు. ఇప్పటి వరకూ ఇలాంటి ప్రమోషన్స్ కేవలం హాలీవుడ్ సినిమాలకు మాత్రమే చూసాం ఇప్పుడు బాహుబలి టీమ్ కూడా ఇదే ఆలోచనతో దూసుకొస్తున్నారు. ఆర్కా మీడియా వర్క్స్ నిర్మిస్తున ఈ చిత్రం 2017లో ప్రేక్షకుల ముందుకు రానుంది.

,  ,  ,  ,