Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

17-Oct-2017 11:26:33
facebook Twitter Googleplus
Photo

సినిమా కోసం సెట్టింగ్ వేయడం.. ఆ సెట్టింగ్ పర్యాటక ప్రదేశంగా మారిపోవడం అరుదైన విషయమే. బాహుబలి కోసం రూపొందించిన మహిష్మతి సామ్రాజ్యం ఈ ఘనతే సాధించింది. ఈ చిత్రం కోసం హైదరాబాద్ శివార్లలోని రామోజీ ఫిలిం సిటీలో భారీ స్థాయిలో సెట్టింగ్స్ వేసిన సంగతి తెలిసిందే. దాదాపు నాలుగేళ్ల పాటు ఇక్కడే చాలా వరకు బాహుబలి షూటింగ్ జరిగింది. గత ఐదారేళ్లలో రాజమౌళి తన ఇంట్లో కంటే కూడా ఆ సెట్టింగ్స్ మధ్యే ఎక్కువ గడిపాడు. బాహుబలి: ది బిగినింగ్ కోసమే రూ.27 కోట్ల రూపాయల ఖర్చుతో మహిష్మతి సామ్రాజ్యం సెట్టింగ్ తీర్చిదిద్దారు. రెండో భాగానికి వచ్చేసరికి ఇంకో రూ.7 కోట్లు అదనంగా ఖర్చు చేశారు. మొత్తంగా రూ.35 కోట్ల ఖర్చయింది ఈ సెట్టింగ్స్ కోసం.

ఆ ఖర్చుకు తగ్గట్లే అద్భుతంగా తయారయ్యాయి మహిష్మతి సెట్టింగ్స్. ఐతే మామూలుగా షూటింగ్ అవ్వగానే సెట్టింగ్స్ అన్నీ కూల్చేస్తారు. కానీ మహిష్మతి సెట్టింగుల్ని అలాగే ఉంచేశారు. రామోజీ ఫిలిం సిటీలో ఈ ప్రాంతాన్ని ఇటీవలే సందర్శకులకూ అందుబాటులో ఉంచారు. ఇది ఫిలిం సిటీకి అదనంగా పర్యాటకుల్ని ఆకర్షిస్తోంది. దీన్ని అందుబాటులోకి తెచ్చినప్పటి నుంచి రోజూ 10-15 వేల మంది దాకా మహిష్మతి సెట్టింగ్స్ ను సందర్శిస్తున్నట్లు సమాచారం.

,  ,  ,  ,  ,