Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

27-Jul-2016 11:38:44
facebook Twitter Googleplus
Photo

విక్టరీ వెంకటేష్, నయనతారలు జంటగా నటించిన చిత్రం బాబు బంగారం. జూలై 29న విడుదలవాల్సిన ఈ చిత్రం కొన్ని కారణాలవల్ల ఆగష్టు 12కు వాయిదా పడింది. యూత్ ఫుల్ డైరెక్టర్ మారుతి తెరకెక్కించిన ఈ చిత్రం తెలుగుతో పాటు తమిళంలో కూడా విడుదల కానుంది. సితార ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై ఎస్. రాధాకృష్ణ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
ఈ చిత్రాన్ని తమిళంలో ?సెల్వి? పేరుతో ?భద్రకాళి? ఫిలిమ్స్ ద్వారా ?భద్రకాళి ప్రసాద్? విడుదల చేయనున్నారు. ఇప్పటికే తెలుగులో విడుదలైన ఈ చిత్రం తాలూకు ట్రైలర్లు, ఆడియో జనాలను బాగానే ఆకట్టుకుంటున్నాయి. రొమాంటిక్ అండ్ కామెడీ డ్రామాగా తెరెక్కిన ఈ చిత్రానికి ?గిబ్రాన్? సంగీతాన్ని అందించగా ?రిచర్డ్ ప్రసాద్? సినిమాటోగ్రఫీ అందించారు.

,  ,  ,  ,  ,  ,