Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

25-May-2016 14:54:39
facebook Twitter Googleplus
Photo

?భలే భలే మగాడివోయ్? హిట్‌తో దర్శకుడిగా స్టార్ స్టేటస్ కొట్టేసిన మారుతి, ప్రస్తుతం విక్టరీ వెంకటేష్‌తో ?బాబు బంగారం? పేరుతో ఓ కామెడీ సినిమా చేస్తోన్న విషయం తెలిసిందే. వెంకీ స్టైల్లో సరదాగా సాగే ఈ కమర్షియల్ ఎంటర్‌టైనర్‌ ఫస్ట్‌లుక్‌కి అంతటా అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. ఇక ఆ రెస్పాన్స్‌తో రెట్టించిన ఉత్సాహం తెచ్చుకొని ?బాబు బంగారం? టీమ్ జూలై 1న సినిమాను ప్రేక్షకుల ముందుకు తెచ్చేలా ప్రయత్నాలు చేస్తోంది. అదేవిధంగా సినిమాకు సంబంధించిన అసలు కథను పరిచయం చేస్తూ జూన్ 2న టీజర్‌ను విడుదల చేసే ఆలోచన చేస్తున్నట్లు కూడా తెలుస్తోంది.
ఈ టీజర్ రిలీజ్ విషయమై ఇంకా టీమ్ నుంచి ప్రకటనేదీ రాకపోయినా, జూన్ 2నే దాదాపుగా టీజర్‍ను విడుదల చేసే ఆలోచన చేస్తున్నట్లు సమాచారం. ఇక జూన్ 6న గిబ్రాన్ సంగీత దర్శకత్వంలో రూపొందిన ఆడియో విడుదలయ్యే అవకాశం ఉంది. వెంకీ సరసన నయనతార హీరోయిన్‍గా నటిస్తోన్న ఈ సినిమాలో వెంకటేష్ తనదైన కామెడీ టైమింగ్‌తో మెప్పించే పాత్రలో నటిస్తున్నారు. సితార క్రియేషన్స్‌తో కలిసి సురేష్ బాబు ఈ సినిమాను నిర్మిస్తున్నారు.

,  ,  ,  ,  ,  ,