Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

15-Jul-2016 11:44:14
facebook Twitter Googleplus
Photo

విక్టరీ వెంకటేష్, ?భలే భలే మగాడివోయ్‌?తో టాప్ దర్శకుల జాబితాలో చేరిపోయిన మారుతిల కాంబినేషన్‌లో ?బాబు బంగారం? అనే సినిమా రూపుదిద్దుకుంటున్న విషయం తెలిసిందే. టీజర్‌తో విపరీతమైన అంచనాలను రేకెత్తించిన ఈ సినిమా ప్రస్తుతం విడుదలకు సిద్ధంగా ఉన్న క్రేజీ సినిమాల్లో ఒకటిగా చెప్పుకోవచ్చు. ఇక జూలై 29న ఈ సినిమాను విడుదల చేయనున్నట్లు చాలాకాలం క్రితమే ప్రకటించిన టీమ్, తాజాగా సినిమాను ఆగష్టు 12వ తేదీకి వాయిదా వేసింది.
యంగ్‌టైగర్ ఎన్టీఆర్ హీరోగా నటించిన ?జనతా గ్యారెజ్? ఆగష్టు 12 నుండి సెప్టెంబర్ 2కు వాయిదా పడడంతో ?బాబు బంగారం? సినిమా జనతా గ్యారెజ్ టైమ్‍కి వచ్చేస్తోంది. స్వాతంత్ర్య దినోత్సవ (సెలవు దినం) వారం కావడంతో ?బాబు బంగారం? టీమ్ ఆగష్టు 12వ తేదీని బాగా కలిసివచ్చే తేదీగా భావించి ఈ నిర్ణయం తీసుకుంది. వెంకటేష్ సరసన నయనతార హీరోయిన్‌గా నటించిన ఈ సినిమాను సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ నిర్మిస్తోంది. వెంకటేష్ ఈ సినిమాలో ఓ కామెడీ పోలీసాఫీసర్‌గా కనిపించనున్నారు.

,  ,  ,  ,  ,  ,