Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

13-Oct-2016 15:26:14
facebook Twitter Googleplus
Photo

దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ?బాహుబలి?, ఇండియన్ సినిమా చరిత్రలో ఓ మైలురాయిగా చెప్పుకోవచ్చనడంలో సందేహం లేదన్న విషయం తెలిసిందే. గతేడాది జూలై నెలలో విడుదలై ప్రభంజనం సృష్టించిన ఈ సినిమాకు రెండో భాగమైన ?బాహుబలి ది కంక్లూజన్? ప్రస్తుతం సెట్స్‌పై ఉంది. ఇక ఇప్పటికే క్లైమాక్స్‌తో పాటు చాలా వరకు షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా డిసెంబర్ కల్లా మొత్తం పూర్తవుతుందట. అదేవిధంగా పోస్ట్ ప్రొడక్షన్‍ను కూడా పక్కాగా అనుకున్న ప్రకారంగానే పూర్తి చేసి, ఏప్రిల్ 28, 2017న సినిమాను ప్రేక్షకుల ముందుకు తెచ్చేందుకు టీమ్ అన్ని చర్యలూ తీసుకుంటుందట.
ఈ విడుదల తేదీని మార్చే ప్రసక్తే లేదని తెలిపిన టీమ్, ఆ అవగాహన మీదే ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా మొదలుపెట్టేసింది. ఇప్పటికే నైజాం ప్రాంత హక్కులు సుమారు 50 కోట్ల రూపాయలకు అమ్ముడై సినిమాకు ఏ స్థాయి క్రేజ్ ఉందో స్పష్టం చేసింది. ఇక త్వరలోనే అన్ని ప్రాంతాలకు సంబంధించిన బిజినెస్‌ను ప్రొడక్షన్ టీమ్ క్లోజ్ చేయబోతోంది. ప్రభాస్, రానా, అనుష్క, తమన్నా ప్రధాన పాత్రల్లో నటిస్తోన్న బాహుబలిని ఆర్కా మీడియా వర్క్స్ నిర్మిస్తోంది.

,  ,  ,  ,  ,  ,  ,  ,