సంజయ్ లీలా భన్సాలీ డైరక్షన్లో రూపొందుతున్న సినిమా ''బాజీరావ్ మస్తానీ''.. గత కొద్ది రోజులుగా ఫస్ట్ లుక్కుతో తెగ సందడి చేస్తున్న ఈ సినిమా ట్రైలర్‌ను ఎట్టకేలకు విడుదల చేసింది ఈరోస్ సంస్థ. పదండి ఎలా ఉందో చూద్దాం.
నిజానికి ఈ సినిమాను చూస్తే ఎవరికైనా కూడా భన్సాలీ గత సినిమా ''రామ్ లీలా'' గుర్తొస్తుంది. అందులో కూడా సేమ్ ఇలాంటి సెట్స్ డ్రస్సులు విజువల్స్ ఉన్నాయి. పైగా అందులోనూ రణవీర్ సింగ్ దీపికా పదుకొనె ప్రియాంక చోప్రా ఉన్నారు. ఇందులోనూ వారే. ఇక సినిమా కథ విషయానికి వస్తే మరాఠా వీరుడు బాజీరావు పేష్వా స్టోరీ ఇది. మనోడికి కాశీ భాయ్ అనే మొదటి భార్య రెండో భార్య మస్తానీ బేగం లతో ఉన్న లవ్ ఎఫైర్ ఈ సినిమాలో కీలక భాగం కానుంది. అలాగే సినిమా ట్రైలర్లో యుద్దాలూ విన్యాశాలూ చాలా చూపించారు. విజువుల్గా బాగానే కిక్కిచ్చాడు భన్సాలీ.
డిసెంబర్ 18న విడుదల కానున్న ఈ సినిమా బాహుబలికి పోటీగా వస్తోంది. అయితే బాహుబలి కనిపించినంత విజువల్ గ్రాండ్ లుక్ ఈ బాజీరావు దగ్గర లేదులే. కాకపోతే సినిమా కలెక్షన్లు అనేవి కంటెంట్‌లోని ఇతరత్రా అంశాలను బట్టి కూడా ఆధారపడుంటుంది.