Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

23-Aug-2016 11:27:19
facebook Twitter Googleplus
Photo

నందమూరి నటసింహం బాలయ్య హీరోగా నటిస్తోన్న వందో సినిమా గౌతమిపుత్ర శాతకర్ణి ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతోన్న విషయం తెలిసిందే. విలక్షణ దర్శకుడు క్రిష్ తెరకెక్కిస్తోన్న ఈ సినిమా సెట్స్‌పైకి వెళ్ళకముందు నుంచే బిజినెస్ వర్గాల్లో విపరీతమైన ఆసక్తి రేకెత్తిస్తూ వచ్చింది. ఈ నేపథ్యంలోనే ఈ సినిమాకు ఇప్పట్నుంచే ప్రీ రిలీజ్ బిజినెస్ పెద్ద ఎత్తున జరుగుతోంది. తాజాగా తెలుగులో ప్రముఖ టీవీ చానల్స్‌లో ఒకటైన మా టీవీ, గౌతమి పుత్ర శాతకర్ణి సాటిలైట్ హక్కులను భారీ మొత్తానికి కొనుగోలు చేసింది.
సుమారు 9.10 కోట్ల రూపాయలకు మాటీవీ, ఈ సాటిలైట్ హక్కులను సొంతం చేసుకుందని తెలుస్తోంది. బాలయ్య కెరీర్లో సాటిలైట్ రైట్స్ విషయంలో ఇదే రికార్డుగా చెప్పుకోవచ్చు. చారిత్రక నేపథ్యంలో సాగే శాతకర్ణి జీవిత కథతో రూపొందుతోన్న ఈ సినిమాను, క్రిష్, భారీ బడ్జెట్‌తో స్వయంగా నిర్మిస్తున్నారు. సంక్రాంతి కానుకగా జనవరి 12, 2017న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

,  ,  ,  ,  ,  ,  ,