Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

26-May-2017 11:11:51
facebook Twitter Googleplus
Photo

ఆన్ స్క్రీన్ పై డబుల్ మీనింగ్ డైలాగ్స్ ఎప్పుడూ వినిపిస్తూనే ఉంటాయి. అది వెండితెర అయినా.. బుల్లితెర అయినా.. వీటి హంగామా ఎక్కువే. ఇప్పుడు స్మాల్ స్క్రీన్ పై వీటి జోరు మరీ ఎక్కువగా ఉంది. అయితే.. ఆఫ్ స్క్రీన్ లోనూ డబుల్ మీనింగ్ డైలాగ్స్ మాట్లాడి.. ఆడియన్స్ అలరిస్తున్నాం అనుకునే జాబితా ఎక్కువగానే ఉంటుంది. టాప్ రేంజ్ లో ఉన్నవారి నోట వెంట కూడా ఇలాంటివి వస్తూనే ఉన్నాయి.

చలపతి రావు మరీ సింగిల్ మీనింగ్ తో 'పక్కలోకి పనికొస్తారు' అనడం వివాదాస్పదం అయింది కానీ.. మహిళలపై ఇలాంటి కామెంట్స్ కు టాలీవుడ్ లో కొదువేమీ లేదు. మీలో ఎవరు కోటీశ్వరుడు కార్యక్రమానికి అఖిల్ గెస్ట్ గా వచ్చినపుడు.. 'నీకు ఫ్రూట్స్ గురించి తెలియాలంటే నువ్వు కె.రాఘవేంద్రరావుతో ఒక్క సినిమాలో అయినా చేయాల్సిందే. అన్ని రకాల పళ్లను హీరోయిన్ బొడ్డుపై వేశారాయన' అన్నారు మెగాస్టార్. ఓ కుర్ర హీరోతో మెగాస్టార్ ఇలా మాట్లాడాన్ని సమర్ధించడం కష్టం. 'అమ్మాయిల చుట్టూ ఊరికే తిరిగితే ఫ్యాన్స్ ఊరుకుంటారా. గిల్లడాలు - పొడవడాలు ఉండాలని.. నేను ఎక్కని ఎత్తుల్లేవు చూడని లోతుల్లేవు. ముద్దయినా పెట్టేయాలి.. కడుపైనా చేసేయాలి' అంటూ నారా రోహిత్ నటించిన సావిత్రి ఆడియో ఫంక్షన్ లో చేసిన కామెంట్స్ పెను దుమారమే సృష్టించాయి.

ఇప్పుడు చలపతి రావుపై కేసులు దాఖలు అయిన మాట వాస్తవమే అయినా.. జబర్దస్త్.. పటాస్ వంటి పలు టీవీ కార్యక్రమాల్లో మాటల తీరు బూతుల స్థాయిని దాటుతోందంటూ కోర్టుల్లో కేసులు కూడా దాఖలు అయ్యాయి. అయితే.. ఇవేమీ ఆ ప్రోగ్రామ్స్ లో బూతుల రేంజ్ ని తగ్గించలేకపోయాయి.

,  ,  ,  ,  ,