Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

28-Apr-2016 12:24:36
facebook Twitter Googleplus
Photo

శాతకర్ణి కథ ఆధారంగా దర్శకుడు క్రిష్ నందమూరి బాలక్రిష్ణతో వందో చిత్రం చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాకోసం చారిత్రక గ్రంధాలు తిరగేస్తున్న బాలక్రిష్ణ శాతకర్ణి పాత్ర కోసం కసరత్తులు కూడా చేస్తున్నట్లు సమాచారం. ఈ సినిమాలో బాలయ్యది రాజు పాత్ర కావడంతో అందుకు తగ్గట్టు గుర్రపు స్వారీ చేయడం కూడా నేర్చుకుంటున్నారు. అందుకోసం గండిపేట్ లోని హార్స్ క్లబ్ లో ప్రాక్టీస్ చేస్తున్నారు. పాత్రకోసం తన బరువు బాగా తగ్గించుకోవాలనుకుంటున్నారట అందుకోసం యోగా, కార్డియో లతో పాటు స్ట్రిక్ట్ డైట్ ని కూడా అనుసరిస్తున్నారు. ఈ డైట్ ప్రకారం ఎక్కువగా ప్రొటీన్ షేక్, సలాడ్స్ తీసుకుంటున్నట్లు తెలిసింది.
తెలుగువారి గొప్పదనం తెలిపే కథ కావడంతో పాటు అమరావతి రాజధానిగా పరిపాలన సాగించిన గౌతమీ పుత్ర శాతకర్ణి చరిత్ర కాబట్టి ఆ పాత్ర కు తగ్గట్టు బాలయ్య అన్నివిధాల ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నట్లు సమాచారం. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ సినిమా మే నెలలో షూటింగ్ కి వెళుతుందని సమాచారం. దర్శకుడు క్రిష్ ఈ సినిమాలో నాయకిని ఎంపిక చేసే పనిలో ఉన్నాడు.

,  ,  ,  ,  ,  ,