Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

19-Sep-2017 11:35:46
facebook Twitter Googleplus
Photo

డైలాగ్ లు చెప్పే హీరోలు చాలామంది ఉన్నారు. ఒక్కొక్కరు ఒక్కో విధంగా చెబుతారు. అయితే నందమూరి బాలకృష్ణ మాత్రం తనదైన శైలిలో డైలాగులు చెప్పి అందరిని అక్కట్టుకోవడంలో చాలా గ్రేట్ అని చెప్పాలి. సినిమా ఎలాంటిదైనా సరే ఆయన చెప్పే డైలాగ్ ఒక్కటైన సినిమా మొత్తంలో హైలెట్ గా నిలుస్తుంది. జయాపజయాలతో సంబంధం లేకుండా బాలయ్య తీసే సినిమాలు మాత్రం డైలాగులతో ఫ్యాన్స్ కి ఉషారు తెప్పిస్తూనే ఉంటాయి.

బాలయ్య అభిమానులు కూడా ఆయన డైలాగులు చెబుతూ చాలా సంబరపడతారు. మొత్తం సినిమాల్లో ఏ డైలాగ్ ఇష్టమంటే వారు కాస్త ఆలోచించాల్సిందే. ఎందుకంటే బాలయ్య ప్రతి డైలాగ్ వారికి చాలా ఇష్టం. అయితే ఇదే తరహాలో బాలయ్య డైలాగులలో మీకు ఏది ఇష్టమనే ప్రశ్న జూనియర్ ఎన్టీఆర్ కి ఎదురైంది. జూనియర్ ఎన్టీఆర్ కూడా అన్ని డైలాగులు చాలా ఇష్టమని చెప్పాడు. అయితే అన్నిటికంటే ఎక్కువ ఇష్టమైంది మాత్రం నరసింహ నాయుడు సినిమాలోని ప్లేస్ నువ్వు చెప్పినా సరే.. నన్ను చెప్పామన్నా సరే. అనే డైలాగ్ చాలా ఇష్టమని రీసెంట్ గా జరిగిన ఓ ఇంటర్వ్యూలో తారక్ చెప్పాడు.

ప్రస్తుత తారక్ జై లవకుశ చిత్ర ప్రమోషన్ లో చాలా బిజీగా ఉన్నాడు. ఎక్కడికి వెళ్లినా తన గురించే కాకుండా తన నందమూరి కుటుంబం గురించి కూడా చాలా గొప్పగా చెబుతున్నాడు.

,  ,  ,  ,  ,