Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

15-Jun-2017 11:09:05
facebook Twitter Googleplus
Photo

నందమూరి బాలకృష్ణ రీసెంట్ గా పుట్టిన రోజు జరుపుకున్న సంగతి తెలిసిందే. అదే రోజున తన కూతుళ్ల నుంచి బాలయ్య బెంట్లే కారు గిఫ్ట్ అందుకున్న విషయం కూడా తెలిసిందే. ఇప్పుడీ కాస్ట్ లీ కారు కోసం ఫ్యాన్సీ నెంబర్ కూడా సిద్ధమైపోయింది. భారీ మొత్తాన్నే చెల్లించి నెంబర్ సొంతం చేసుకున్నారు బాలకృష్ణ.

రీసెంట్ గా హైద్రాబాద్ లోని ఖైరతాబాద్ ఆర్టీఏ ఆఫీసులో ఫ్యాన్సీ నెంబర్ల వేలం జరిగింది. ఆక్షన్ ద్వారా ట్రాన్స్ పోర్ట్ డిపార్ట్ మెంట్ కు భారీగానే ఆదాయం సమకూరగా.. ఈసారి అందులో బాలయ్య వాటా కూడా గట్టిగానే ఉంది. మొత్తం 30లక్షల రూపాయల ఆదాయం వస్తే.. అందులో బాలయ్య వాటానే పాతిక శాతం పైగా ఉంది. బాలయ్య తన కొత్త కారుకు నెంబరు కోసం ఏకంగా 7.77 లక్షల రూపాయలు చెల్లించడం విశేషం. TS 09 EU 0001 నెంబర్ ను.. తన కొత్త బెంట్లే కారు కోసం గెలుచుకున్నారు బాలకృష్ణ.

కాస్ట్ లీ కారు.. ఫ్యాన్సీ నెంబర్ సంగతి ఇలా ఉంటే.. ఇక కొత్త సినిమా కబుర్లు కూడా బాగానే వినిపిస్తున్నాయి. పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో రూపొందుతున్న బాలకృష్ణ 101వ చిత్రానికి పైసా వసూల్ అంటూ టైటిల్ ను ఫైనల్ చేయగా.. ఇప్పటికే రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్లు ఆన్ లైన్ లో తెగ హంగామా చేస్తున్నాయి.

,  ,  ,  ,  ,  ,