Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

09-Mar-2017 15:56:39
facebook Twitter Googleplus
Photo

ప్రకటన లేకుండా బాలయ్య తన సినిమా 101వ సినిమా పూరితో అని చెప్పడం, పూరి కూడా ఆ పక్క రోజే సినిమాని ప్రకటించేయడంతో ఆశ్చర్యంతో పాటు ఆనందపడటం కూడా నందమూరి అభిమానుల వంతైంది. అస్సలు ఎప్పుడూ ఊహించని ఈ కాంబినేషన్ ఎలా ఉంటుంది, బాలయ్య – పూరిలు సినిమా గురించి ఎలా ఆలోచిస్తున్నారు అని అందరూ ఆలోచనలో కూడా పడ్డారు. వాళ్ళు ఆ ఆలోచనలో ఉండగానే ఈరోజు ఉదయం సినిమా ప్రారంభోత్సవం కూడా చేసేసిన బాలయ్య పూరీలు అసలు సినిమా పట్ల తమ వెర్షన్ ఏంటో బయటపెట్టారు.
ముందుగా బాలకృష్ణ విషయానికొస్తే ప్రారంభోత్సవం సందర్బంగా మాట్లాడిన ఆయన సినిమా అభిమానులకు చాలా బాగా నచ్చుతుందని, ముఖ్యంగా తన పాత్ర అయితే ఒక ట్రీట్ లా ఉంటుందని చాలా నమ్మకంగా చెప్పారు. ఇక పూరి జగన్నాథ్ అయితే తన పాత స్టైల్ లోనే సినిమా రెగ్యులర్ షూట్ కి వెళ్లకముందే సెప్టెంబర్ 29న సినిమా రిలీజ్ అని చెప్పేసి ఒకరోజు ముందుగా అయినా రిలీజ్ చేస్తాం కానీ ఆలస్యమయ్యే ఛాన్సే లేదని బల్లగుద్ది చెప్పారు.

,  ,  ,  ,  ,