Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

08-Jun-2016 12:04:48
facebook Twitter Googleplus
Photo

ఇప్పుడు 'నాగభరణం' అంటూ ఒక సినిమా వస్తోంది. కన్నడలో కోడి రామకృష్ణ తీసిన ఈ సినిమాను తెలుగులో కూడా అలా డబ్ చేసి రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ సినిమాలోని ఎక్సటెన్సివ్ విజువల్ ఎఫెక్ట్సే ఆడియన్స్ కు భయంకరంగా థ్రిల్ ఇస్తాయని అందరూ చెప్పడమే కాదు.. టీజర్ తో కోడి వారు షాకిచ్చిన సంగతి కూడా తెలిసిందే.

ఈ సినిమా టీజర్ లోని విశిష్టత ఏంటంటే.. దివంగత నటుడు లెజండరీ డా.విష్ణువర్దన్ ను కంప్యూటర్ గ్రాఫిక్స్ లో తయారు చేసి.. చాలావరకు రియాల్టీకి దగ్గరగా ఆయన్ను అవతార్ సినిమా రేంజులో సృష్టించి.. ఆ క్యారెక్టర్ తో కొంత పార్టు తీసి.. దానిలో కొంచెం ముందే చూపించారు. ఆ టీజర్ చూసిన తరువాత.. ఒకవేళ తాను కూడా నాన్నగారు నందమూరి తారకరామారావు క్యారెక్టర్ ను ''గౌతమీపుత్ర శాతకర్ణి'' సినిమాలో అదే విధంగా క్రియేట్ చేస్తే ఎలా ఉంటుంది అని ఆలోచిస్తున్నారట నందమూరి బాలకృష్ణ. ఇప్పటివరకు చాలా సినిమాల్లో ఎన్టీఆర్ ను గ్రాఫిక్స్ ద్వారా తీసుకొచ్చినా.. అవన్నీ కేవలం పాత సినిమాల్లోని ఆయన ఫుటేజ్ తీసి.. విజువల్ ఎఫెక్ట్స్ ద్వారా కలపి.. డబ్బింగ్ లో ఆయన వాయిస్ మేనేజ్ చేశారు. అదే కంప్యూటర్ లో 3డి టెక్నాలజీ ద్వారా ఆయన్ను క్రియేట్ చేస్తే.. ఆయన క్యారెక్టర్ ఏపనైనా చేసేలా చేయొచ్చు.

కాని ఎన్టీఆర్ 3డి క్యారెక్టర్ రియలిస్టిక్ గా కనిపించాలంటే ఖర్చు కొన్ని కోట్లలో ఉంటుంది. అవతార్ సినిమా క్వాలిటీ అంటే మాటలు కాదు. అంత ఖర్చు ఇప్పుడు 100వ సినిమాపై పెట్టగలమా లేదా ఆలోచించి చెప్పమని దర్శకుడు క్రిష్ కే వదిలేశారట బాలయ్య. అయితే ఈ ఐడియా అంతగా ఫీజిబుల్ కాదని క్రిష్ చెప్పడంతో.. ఆయన తన ఖరీదైన కోరికను ప్రస్తుతానికి విరమించుకున్నట్లే.

,  ,  ,  ,  ,  ,