Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

14-Aug-2017 14:04:32
facebook Twitter Googleplus
Photo

తాను చేయాలనుకున్నది చేసేస్తాడు నందమూరి బాలకృష్ణ. స్టేజ్ ఎక్కితే బాలయ్య ప్రసంగాలు ఎలా ఉంటాయో కొత్తగా చెప్పాల్సిన పని లేదు. ఈ విషయంలో చాలా విమర్శలు.. సెటైర్లు ఎదుర్కొన్నాడు బాలయ్య. అయినా కూడా బాలయ్య తగ్గడసలు. తన సినిమాల ఆడియో వేడుకల్లో సుదీర్ఘ ప్రసంగాలు చేస్తుంటాడు. ఐతే ఈ మధ్య బాలయ్య వేదికలెక్కి పాటలు పాడే ప్రయత్నం కూడా చేస్తున్నాడు. మేము సైతం ప్రోగ్రాంలో తొలిసారి ఒక పూర్తి స్థాయి పాట పాడి అందరినీ ఆశ్చర్యానికి గురి చేశాడు బాలయ్య. ఆ తర్వాత కూడా మరో వేడుకలో పాటందుకున్నాడు. తన అమెరికా పర్యటనలో కూడా బాలయ్య ఈ సాహసం చేశాడు.

తన పాటలకు వచ్చిన ఫీడ్ బ్యాక్ గురించి పట్టించుకోకుండా బాలయ్య మరోసారి గొంతు సవరించుకోబోతున్నట్లు సమాచారం. ఈ నెల 17న ఖమ్మం వేదికగా జరగబోయే తన కొత్త సినిమా ‘పైసా వసూల్’ ఆడియో వేడుకలో బాలయ్య సింగర్ అవతారమెత్తబోతున్నాడట. ఈ వేదిక మీద లైవ్ లో పాట పాడబోతున్నాడట. బాలయ్య తొలిసారిగా ఓ సినిమా కోసం పాట పాడింది ఈ సినిమా కోసమే. ఏక్ పెగ్ లావో...అంటూ సాగుతుంది ఆ పాట. ఈ సాంగ్ ఆడియోలో వినడం కంటే ముందు బాలయ్య లైవ్ లో పాడి వినిపించబోతున్నాడట. మరి ఆ పాటకు అభిమానుల నుంచి ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో చూడాలి.

,  ,  ,  ,  ,  ,