Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

25-Feb-2017 10:07:52
facebook Twitter Googleplus
Photo

నందమూరి బాలకృష్ణ హీరోగా నటించబోయే 101వ సినిమా ఖరారయింది. పూరి జగన్నాథ్ ఈ సినిమాకు దర్శకత్వం వహించనున్నారు. భవ్య క్రియేషన్స్ అధినేత వి. ఆనంద్ ప్రసాద్ ఈ సినిమాను నిర్మించనున్నారు. పవర్ ఫుల్ డైలాగులంటే తెలుగు ప్రేక్షకులకు ముందు గుర్తొచ్చే స్టార్ హీరో బాలకృష్ణ. హీరోయిజాన్ని ప్రతి సీన్లోనూ ఎలివేట్ చేస్తూ.. పంచ్ డైలాగులతో మోత మోగించడం పూరీ స్టైల్. వీరిద్దరి కాంబినేషన్ లో సినిమా అనగానే నందమూరి అభిమానుల్లో మామూలు క్రేజ్ వుండదు. ఇలాంటి కాంబినేషన్ సెట్టవుతుందని కలలో కూడా ఊహించి వుండరు అభిమానులు. అది నిజమైంది.

మహాశివరాత్రి సందర్భంగా ఈ సెన్సేషనల్ కాంబినేషన్ గురించి పూరీ ట్విట్టర్లో వెల్లడించారు.

,  ,  ,  ,  ,  ,