Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

17-Dec-2014 10:43:29
facebook Twitter Googleplus
Photo

బాలకృష్ణ అభిమానులకు గుడ్ న్యూస్. నూతన సంవత్సరం సందర్భంగా ఫ్యాన్స్ కు బాలయ్య చిన్న కానుక ఇవ్వనున్నారు. ప్రస్తుతం ఆయన నటిస్తున్న తాజా చిత్రం ఫస్ట్ లుక్ టీజర్ ను ఈ నెల 31 అర్ధరాత్రి సరిగ్గా 12 గంటలకు విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. అప్పటికే నూతన సంవత్సర సంబరాల్లో వుండే బాలయ్య అభిమానులకు ఇదొక చిరు కానుక అవుతుంది. కాగా, ఈ సినిమా కోసం 'లయన్' అనే టైటిల్ పరిశీలనలో వుంది. అయితే, ఇది మరొక నిర్మాత వద్ద ఉండడంతో, మరొక టైటిల్ గా 'వారియర్' అనే పేరును ప్రత్యామ్నాయంగా పరిశీలిస్తున్నారు. సత్యదేవ్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాలో బాలకృష్ణ సరసన త్రిష, రాధికా ఆప్టే హీరోయిన్లుగా నటిస్తున్నారు.

,  ,  ,  ,  ,  ,