Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

02-Nov-2017 12:32:02
facebook Twitter Googleplus
Photo

బడా నిర్మాత కుమారుడు బెల్లకొండ శ్రీనివాస్ జయాపజయాలతో సంబంధం లేకుండా సినిమాలను బాగానే చేస్తున్నాడు. అది కూడా స్టార్ డైరెక్టర్లతో సినిమా చేయడం చాలా అదృష్టమని చెప్పాలి. జయ జానకి నాయకతో పర్వాలేదు అనిపించినా ఈ కుర్ర హీరో నెక్స్ట్ సినిమా కోసమా మరింత కష్టపడుతున్నాడు. మొన్నటి వరకు యాక్షన్ మాస్ సినిమాలనే చేసిన శ్రీనివాస్ ఇప్పుడు కాస్త కొత్త తరహా సినిమాను చేస్తున్నాడు.

ఏకంగా ప్రకృతి తో పోరాడే ధీరుడిలా కనిపించడానికి రెడీ అవుతున్నాడు. శ్రీవాస్ దర్శకత్వంలో 'సాక్ష్యం' అనే సినిమాను మొదలు పెట్టిన సంగతి తెలిసిందే. గాలి - భూమి అలాగే నీరు అగ్ని మరియు స్పెస్ చుట్టూ కథ తీరుగుతుందట. పంచభూతాల నడుమ సాగే ఈ సినిమా ఫస్ట్ లుక్ ని కూడా చిత్ర యూనిట్ ఇటీవల రిలీజ్ చేసింది. అయితే ఈ శ్రీవాస్ దర్శకత్వంపై తనకు చాలా నమ్మకం ఉందని నిర్మాత అభిషేక్ నామ కూడా చెబుతున్నాడు.

రీసెంట్ గా 200 మందితో కర్ణాటక లోని బళ్లారిలో యాక్షన్ సీన్స్ ను తెరకెక్కించిందట చిత్ర యూనిట్. పీటర్ హెయిన్స్ నేతృత్వంలో సాగుతోన్న ఈ ఫైట్ సీన్స్ లో బెల్లంకొండ శ్రీనివాస్ కూడా చాలా కష్టపడి వర్క్ చేస్తున్నాడట. అంతే కాకుండా పూజ హెగ్డే కూడా ఆ షూటింగ్ లో పాల్గొంది. నవంబర్ 5 వరకు బళ్లారిలోనే షూటింగ్ జరపనుందట చిత్ర యూనిట్.

,  ,  ,  ,  ,