Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

05-Dec-2017 12:01:07
facebook Twitter Googleplus
Photo

సినిమా హిట్ అవ్వడమే కాకుండా ఎక్కువ కలెక్షన్స్ ని అందుకోవాలంటే రిలీజ్ డేట్ కూడా చాలా ముఖ్యం. ఏ టైమ్ లో రిలీజ్ చేస్తున్నాం. ఆ టైమ్ లో ఎలాంటి సినిమాలు రిలీజ్ అవుతున్నాయి అనే విషయాల గురించి కూడా ఆలోచించుకోవాలి. ఈ మధ్య కాలంలో ఎక్కువగా ఒక సినిమా రిజల్ట్ ప్రభావం మరొక సినిమా కలెక్షన్స్ పై ఎంతో కొంత ప్రభావం చూపుతుంది. సినిమా మీద నమ్మకంతో కొందరు సినిమాలను రిలీజ్ చేస్తున్నారు.

ఇక అసలు విషయానికి వస్తే.. వచ్చే ఏడాది సమ్మర్ బాక్స్ ఆఫీస్ ని హీటెక్కించడానికి కొన్ని సినిమాలు పోటీపడనున్నాయి. ముఖ్యంగా ఏప్రిల్ లో భారీ సినిమాలు రిలీజ్ కాబోతున్నాయి. అయితే 2.0 సినిమా వల్ల ఇప్పుడు రిలీజ్ డేట్స్ ని మళ్లీ మార్చుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. 2018 ఏప్రిల్ 27న అల్లు అర్జున్ - మహేష్ బాబు పోటీపడబోతున్నారు. నా పేరు సూర్యా - భరత్ అను నేను.. రెండు భారీ బడ్జెట్ సినిమాలే కావడంతో పోటీ ఎలా ఉంటుందో అని అందరు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కానీ రజినీకాంత్ - 2.0 కూడా అదే టైమ్ కి రిలీజ్ కాబోతుండడంతో ఆ సినిమాలో వెనక్కి తగ్గుతున్నాయి.

ముఖ్యంగా మహేష్ చాలా ముందుకు వచ్చాడని టాక్. అసలు పోటీ ఏ మాత్రం ఉండకూడదు అని ఏప్రిల్ 13న కూల్ గా రావాలని డిసైడ్ అయ్యాడట. అలాగే నా పేరు సూర్యా సినిమా వారం వెనక్కి తగ్గి ఏప్రిల్ 20న రాబోతోందని ఒక టాక్. మరి ఈ ముందు జాగ్రత్త ఈ స్టార్ హీరోలకు ఎంతవరకు ఉపయోగపడుతుందో చూడాలి. ఇకపోతే మరొక రూమర్ విషయానికి వస్తే.. దర్శకుడు కొరటాల శివ భరత్ అనే నేను టైటిల్ ను మార్చే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఆ టైటిల్ ని రిజిస్టర్ చేయించినా దర్శకుడు మాత్రం మారుద్దాం అనే ఆలోచనతో ఉన్నాడట.

,  ,  ,  ,  ,  ,