Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

30-Aug-2017 11:08:04
facebook Twitter Googleplus
Photo

టాలీవుడ్ స్టార్ హీరోల సినిమాలకు బాలీవుడ్ లో మంచి డిమాండ్ ఏర్పడింది. మురుగదాస్ దర్శకత్వంలో సూపర్ స్టార్ ప్రిన్స్ మహేష్ బాబు నటించిన స్పైడర్ చిత్రానికి హిందీలో కూడా మంచి క్రేజ్ సంపాదించింది. ఆ చిత్రం హిందీలో రీమేక్ అవుతుందా? డబ్ అవుతుందా? అన్న విషయంపై క్లారిటీ రావాల్సి ఉంది. ఓ బాలీవుడ్ నిర్మాణ సంస్థ స్పైడర్ హిందీ కాపీరైట్స్ కోసం 16 కోట్లు ఆఫర్ చేసినట్లు వార్తలు వచ్చాయి. అదే తరహాలో కొరటాల శివ దర్శకత్వంలో ప్రిన్స్ నటిస్తున్న భరత్ అను నేను సినిమాకు విపరీతమైన క్రేజ్ ఏర్పడింది. ఇటీవలే షూటింగ్ ప్రారంభించిన ఆ సినిమా వరల్డ్ వైడ్ థియేటర్ రైట్స్ కోసం నిర్మాతకు భారీ ఆఫర్లు వస్తున్నట్లుగా తెలుస్తోంది.

కొరటాల శివ - మహేష్ బాబు కాంబోలో వచ్చిన శ్రీమంతుడు చిత్రం బాక్సాఫీస్ రికార్డులను బద్దలు కొట్టిన సంగతి తెలిసిందే. దీంతో సందేశాత్మక చిత్రాలను తెరకెక్కించే శివ దర్శకత్వంలో ప్రిన్స్ కథానాయకుడిగా రాబోతున్న 'భరత్ అను నేను' సినిమాపై ఇప్పటినుంచే భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఈ సినిమా షూటింగ్ పూర్తవక ముందే ప్రపంచవ్యాప్తంగా థియేటర్ హక్కులను అవుట్ రేట్ కు ఇవ్వమంటూ భారీ ఆఫర్లు వస్తున్నాయట. రెండు తెలుగు రాష్ట్రాల్లో మహేష్ కు ఉన్న క్రేజ్ వల్ల థియేటర్ హక్కులు దాదాపు 80 కోట్లు పలకవచ్చని తమిళ - మలయాళ - హిందీ - ఓవర్సీస్ హక్కులు మొత్తం కలుపుకుని 40 కోట్ల వరకూ ఉండొచ్చని ట్రేడ్ వర్గాల అంచనా. దీంతో ఈ సినిమాను అవుట్ రేట్ గా 115 కోట్లకి కొనేందుకు బడా నిర్మాణ సంస్థలు రెడీగా ఉన్నాయట.

,  ,  ,  ,  ,