Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

04-Jul-2016 11:39:30
facebook Twitter Googleplus
Photo

పవర్? సినిమాతో తెలుగు పరిశ్రమకు దర్శకుడిగా మంచి ఎంట్రీ ఇచ్చిన బాబీ, ఆ తర్వాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌ను డైరెక్ట్ చేసే అవకాశం సొంతం చేసుకొని టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారిపోయారు. అయితే పవన్ హీరోగా బాబీ తెరకెక్కించిన ?సర్దార్ గబ్బర్ సింగ్? సినిమా బాక్సాఫీస్ వద్ద ఘోర పరాజయం పాలవ్వడంతో బాబీకి మొదట్లో వచ్చిన క్రేజ్ అంతా పోయింది. ఇక ఈ నేపథ్యంలోనే బాబీ తన కొత్త సినిమాను మళ్ళీ చాలా జాగ్రత్తగా ప్లాన్ చేసుకుంటున్నారు.
తనను దర్శకుడిగా పరిచయం చేసిన రవితేజతోనే బాబీ కొత్త సినిమా చేయనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఓ మంచి కమర్షియల్ కథను రవితేజకు వినిపించగా, ఆయన కూడా వెంటనే ఓకే చెప్పారని సమాచారం. ప్రస్తుతం బాబీ పూర్తి స్థాయి కథను సిద్ధం చేసే పనిలో ఉన్నారట. అన్నీ కుదిరితే రవితేజ తన ?రాబిన్‌హుడ్? సినిమాను పూర్తి చేయగానే, బాబీ సినిమా సెట్స్‌పైకి వెళుతుందని తెలుస్తోంది.

,  ,  ,  ,  ,  ,