Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

14-Oct-2016 10:39:27
facebook Twitter Googleplus
Photo

రామ్ చరణ్ ఇపు్పడు ధృవ టీజర్ ఇచ్చిన కిక్కుతో ఫుల్ ఊపుమీదున్నాడు. అప్పుడే దసరానాడు రిలీజైన ఈ టీజర్ కు ఏకంగా 2 మిలియన్ల వ్యూస్ రావడంతో.. యుట్యూబ్ సాక్షిగా ఈ సినిమాపై ఎన్ని అంచనాలు ఉన్నాయో అర్ధమవుతున్నాయి. అందుకే చరణ్ కూడా వాటికి అనుగుణంగా పనిచేస్తున్నాడట.

గతంలో ''ఆరెంజ్'' సినిమాలో ఒక పాటను కంపోజ్ చేశారు బాస్కో-సీజర్. అయితే బాలీవుడ్ కొరియోగ్రాఫర్లు అయిన ఈ ఇద్దరూ.. ఇప్పుడు విడిపోయారు. ఒకరు డైరక్షన్ వైపు అడుగులు వేస్తుంటే.. మరొకరు మాత్రం కొరియోగ్రాఫీలోనే ఉండిపోయారు. అయితే సీజర్ గోన్ స్లేవ్స్ డైరక్షన్ వైపు అడుగులు వేసినా కూడా.. బాస్కో మార్టిస్ మాత్రం బాస్కో-సీజర్ అనే పేరుతోనే పాటలు కంపోజ్ చేస్తున్నాడు. ఆ మధ్యన శ్రీమంతుడు సినిమాలో ఒక పాటను కంపోజ్ చేసిన ఈ బాలీవుడ్ బాద్షా ఇప్పుడు చరణ్ కోసం ''ధృవ'' సినిమాలో ఒక పాటను కంపోజ్ చేశాడు.

చరణ్ అండ్ రకుల్ పై ప్రస్తుతం ఆ సాంగ్ షూటింగ్ హైదారాబాదులోనే సాగుతోంది. అసలే ఈ జంట ''బ్రూస్ లీ'' సినిమాలో కుమ్మేశారు. చెర్రీ తన డ్యాన్సులతో.. రకుల్ తన హాట్ లుక్కులతో పిచ్చెత్తించారు. ఇప్పుడేం చేస్తారో చూడాలి మరి.

,  ,  ,  ,  ,  ,