Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

03-Jan-2017 10:51:16
facebook Twitter Googleplus
Photo

టాలీవుడ్ కి బెల్లంకొండ శ్రీనివాస్ యాక్షన్ హీరోగానే పరిచయం అయ్యాడు. వివి వినాయక్ దర్శకత్వంలో రూపొందిన అల్లుడు శీను మాస్ ఎంటర్టెయినరే. ఆ తర్వాత స్పీడున్నోడు అంటూ మరో మూవీ చేసినా ఆకట్టుకోలేకపోయిన బెల్లంకొండ.. ప్రస్తుతం యాక్షన్ సీక్వెన్స్ ను పీక్ లెవెల్ లో చూపించే బోయపాటి శ్రీనుతో జత కట్టాడు.

జనవరి 3న ఈ హీరో బర్త్ డే కావడంతో.. హీరో లుక్ ని విడుదల చేశాడు బోయపాటి. ఏకంగా ఓ కారు డోర్ ని పట్టుకుని.. ఫైట్ చేసేందుకు పరుగెడుతూ.. గాల్లోనే ఉన్న లుక్ అదిరిపోయిందని చెప్పాలి. బోయపాటి మార్క్ యాక్షన్ అంటే ఎలా ఉటుందో సింపుల్ గా ఒక్క ఫోటోలోనే చూపించేయడం విశేషం. ఈ యాక్షన్ ఎపిసోడ్ లో ఏ రేంజ్ ఎనర్జీ ఉంటుందో.. ఫైట్ సీన్ సరౌండింగ్స్ చూస్తే అర్ధమవుతుంది. మాస్ హీరో ఇమేజ్ కోసం కష్టపడుతున్న బెల్లంకొండ.. సరిగ్గా తను కోరుకునే టైపు మూవీ చేస్తున్నాడని చెప్పాలి.

ఇంకా టైటిల్ నిర్ణయించని ఈ చిత్రంలో రకుల్ ప్రీత్ సింగ్ లీడ్ హీరోయిన్ కాగా.. ప్రగ్యా జైస్వాల్ కూడా నటిస్తోంది. శరత్ కుమార్.. జయసుధ లాంటి సీనియర్ ఆర్టిస్టులు భాగం కావడం చూస్తుంటే.. అటు ఫ్యామిలీ ఎమోషన్స్ ను.. ఇటు యాక్షన్ ఎలిమెంట్స్ ను బోయపాటి పక్కాగా మిక్స్ చేసేశాడనిపించడం ఖాయం.

,  ,  ,  ,  ,  ,  ,