Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

21-Apr-2016 14:53:30
facebook Twitter Googleplus
Photo

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ - రకుల్ ప్రీత్ సింగ్ ల జోడీతో సరైనోడు చిత్రాన్ని తెరకెక్కించాడు దర్శకుడు బోయపాటి శ్రీను. ఏప్రిల్ 22న ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా భారీ ఎత్తున విడుదల కానుంది. ప్రస్తుతం ఈ మూవీ ప్రమోషన్స్ పీక్ స్టేజ్ లోకి చేరుకున్నాయి. హీరో హీరోయిన్లతో పాటు బోయపాటి కూడా ప్రమోషనల్ వర్క్స్ లో తెగ బిజీగా ఉన్నాడు. సరైనోడు హంగామా పూర్తి కాగానే.. తన మరుసటి మూవీ పనులు ప్రారంభించనున్నాడు బోయపాటి శ్రీను.

అల్లుడు శీను - స్పీడున్నోడు చిత్రాల హీరో బెల్లంకొండ శ్రీనివాస్ తో ఈ దర్శకుడి నెక్ట్స్ ప్రాజెక్ట్ ఇప్పటికే ఖాయమైంది. ఇప్పుడీ సినిమాలో కూడా రకుల్ నే హీరోయిన్ గా తీసుకోవాలని బోయపాటి అనుకుంటున్నాడట. ఈమేరకు ఆమెను వ్యక్తిగతంగా కూడా రకుల్ కి ఆఫర్ పంపాడట ఈ దర్శకుడు. సరైనోడు సినిమా చేస్తున్న సమయంలో ఈ బ్యూటీ కమిట్ మెంట్ - యాక్టింగ్ స్కిల్స్ - టైమ్ సెన్స్ లాంటి ఎన్నో లక్షణాలు బోయపాటిని బాగా ఆకర్షించడంతో.. తన మరుసటి ప్రాజెక్టులో కూడా రకుల్ ప్రీత్ ఉంటే బాగుంటుదనే ఉద్దేశానికి వచ్చాడట బోయపాటి.

అయితే.. బెల్లంకొండతో సినిమాకి రకుల్ ఒప్పుకుందా అనే విషయం ఇంకా తెలియలేదు. ప్రస్తుతం రామ్ చరణ్ తో ధృవ - సాయిధరం తేజ్ తో ఓ సినిమా - తమిళ్ లో విశాల్ తో ఓ మూవీకి కమిట్ అయింది రకుల్ ప్రీత్. మరిప్పుడు బెల్లంకొండతో సినిమాకి డేట్స్ ప్రాబ్లెం లేకపోతే యాక్సెప్ట్ చేసే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయంటున్నారు.

,  ,  ,  ,  ,