Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

01-Aug-2017 12:42:31
facebook Twitter Googleplus
Photo

శ్రీను తన సినిమాల ఆడియో వేడుకల్లో కొంచెం ఎక్కువగానే మాట్లాడేస్తుంటాడు. తన సినిమాల గురించి ఓ రేంజిలో చెప్పేసుకుంటూ ఉంటాడు. జయ జానకి నాయక ఆడియో వేడుకలో ఈ సినిమా గురించి కూడా అలాగే చెప్పుకున్నాడు. దాని సంగతి ఓకే కానీ.. బాలయ్యతో తాను తీసిన బ్లాక్ బస్టర్ మూవీ లెజెండ్ ప్రస్తావన తెచ్చి.. దాన్ని తెలుగు సినిమాకు గర్వకారణంగా చెబుతూ చెప్పిన ఉదాహరణే అందరూ ముక్కున వేలేసుకునేలా చేసింది. సోమవారం రాత్రి జరిగిన జయ జానకి నాయక ఆడియో ఫంక్షన్లో బోయపాటి మాట్లాడుతూ.. ఈ ఏడాది తెలుగు సినిమాకు సంబంధించి నాలుగు అద్భుతాలు జరిగాయంటూ వాటి గురించి ఏకరువు పెట్టాడు బోయపాటి.

ముందుగా కళాతపస్వి విశ్వనాథ్ కు దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు దక్కడం తెలుగు వాళ్లందరూ గర్వించదగ్గ విషయం అన్నాడు. ఓకే. తర్వాత బాహుబలి: ది కంక్లూజన్ ప్రస్తావన తెచ్చి.. ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వాళ్లందరూ గర్వించే సినిమా అయిందన్నాడు. అదీ ఓకే. ఆ తర్వాత తాను మెగాస్టార్ చిరంజీవి రీఎంట్రీ గురించి మాట్లాడాడు. త్వరలోనే చిరుతో సినిమా చేయాల్సి ఉన్న నేపథ్యంలో ఈ స్తుతి కూడా అర్థం చేసుకోదగ్గదే.

ఐతే నాలుగో విషయం చెబుతూ.. లెజెండ్ వెయ్యి రోజులకు పైగా ఆడటం గురించి గొప్పగా చెప్పుకున్నాడు బోయపాటి. ఒకే థియేటర్లో వెయ్యి రోజులకు పైగా ఆడిన.. నాలుగు క్యాలెండర్లు చూసిన సినిమా దక్షిణాదిన ఇంకేదీ లేదని.. ఇది గర్వించాల్సిన విషయమని చెప్పాడు బోయపాటి. కానీ ఎంత హిట్టు సినిమా అయినా పట్టుమని 50 రోజులు థియేటర్లలో నిలవడమే గగనమైపోతున్న ఈ రోజుల్లో.. ఒక సినిమా వెయ్యి రోజులకు పైగా ఎలా ఆడిందన్నది అర్థం చేసుకోలేని స్థితిలో ఉన్నారా జనాలు? ఇలాంటి విషయాలపై జనాల్లో చర్చకు తావివ్వకుండా సైలెంటుగా ఉండటం మంచిది.

,  ,  ,  ,