Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

16-Feb-2017 10:50:54
facebook Twitter Googleplus
Photo

బ్రహ్మానందం జోరు ఇప్పుడు తగ్గిందనే విషయంలో సందేహం అక్కర్లేదు. ఖైదీ నంబర్ 150లో మెగాస్టార్ పక్కన.. ఎక్కువ స్క్రీన్ స్పేస్ ఉన్నా బ్రహ్మీకి దక్కిన క్రెడిట్ తక్కువే. అయితే.. త్వరలో ఈ స్టార్ కమెడియన్ కి మళ్లీ తన సత్తా చూపే అవకాశం రానుంది. 'ఆచారి అమెరికా యాత్ర' అనే సినిమా తెరకెక్కబోతోంది.

మంచు విష్ణు హీరోగా నటించే ఈ మూవీలో ఆచారి ఎవరో కాదు.. బ్రహ్మానందమే. ఆచారి అన్న మాట వినగానే.. అదుర్స్ మూవీలో ఎన్టీఆర్ గుర్తుకు రావడంలో ఆశ్చర్యమేమీ లేదు. ఆ మూవీలో ఆ చారికి గురువుగా మెప్పించినది కూడా బ్రహ్మీనే. ఇప్పుడు తనే ఆచారి అవతారం ఎత్తుతున్నాడన్న మాట. అయితే.. ఇప్పటికే సెట్స్ పై ఉన్న రెండు స్టార్ హీరోల సినిమాల్లో ఇలాంటి రోల్స్ ఉన్నాయనే టాక్ గట్టిగానే ఉంది. హరీష్ శంకర్ డైరెక్షన్ లో.. డీజే-దువ్వాడ జగన్నాధంగా నటిస్తున్న బన్నీ.. ఓ పాత్రలో చారి టైపు రోల్ లోనే కనిపించనున్నాడనే టాక్ ఉంది.

అసలు ఈ చారి రోల్ సృష్టించినది.. అప్పట్లో వినాయక్ కు అసిస్టెంట్ గా వర్క్ చేసిన హరీష్ శంకరే కావడంతో.. ఈ టాక్ మరీ బలపడింది. మరోవైపు రీసెంట్ గా బాబీ దర్శకత్వంలో ఎన్టీఆర్ ఓ మూవీ స్టార్ట్ చేశాడు. ఇందులో యంగ్ టైగర్ మూడు పాత్రలు చేయనుండగా.. వీటిలో ఒక పాత్రకు చారినే స్ఫూర్తి అంటున్నారు. అసలు ఈ కథ అదుర్స్2 టైపులో ఉండడంతోనే ఎన్టీఆర్ ఒప్పుకున్నాడనే రూమర్ కూడా ఉంది.

అంటే ఇప్పుడు చారి అయినా.. ఆచారి అయినా.. అదే టైపు రోల్స్ లో ముగ్గురు నటించేస్తున్నారన్న మాట. బన్నీ.. ఎన్టీఆర్.. బ్రహ్మీ.. ముగ్గురు అచారి రోల్స్ లోనే కనిపించనున్నారు. ఇంతమంది చారిలను జనాలను ఎలా రిసీవ్ చేసుకుంటారో?

,  ,  ,  ,  ,