Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

14-Apr-2017 11:47:38
facebook Twitter Googleplus
Photo

80లు - 90ల్లో కమెడియన్ గా తిరుగులేని ఆధిపత్యం చలాయించాడు బ్రహ్మానందం. టాలీవుడ్లో బోలెడంత కమెడియన్లున్నా సరే.. అందర్లోకి పైచేయి బ్రహ్మిదే. ఐతే 2000 తర్వాత అనుకోకుండా బ్రహ్మి జోరు కొంచెం తగ్గింది. సునీల్ - వేణుమాధవ్ లాంటి కమెడియన్ల జోరుతో బ్రహ్మికి అవకాశాలు తగ్గాయి. ఆ సమయంలోనే బ్రహ్మి ఒక్కసారిగా మళ్లీ పుంజుకుని కమెడియన్గా ఎవ్వరూ అందుకోలేని స్థాయికి చేరిపోయాడు. బ్రహ్మి అలా రైజ్ అవడంలో శ్రీను వైట్లది కీలక పాత్ర. వెంకీ - ఢీ - రెడీ - కింగ్ - దూకుడు - బాద్ షా లాంటి సినిమాల్లో అదిరిపోయే కామెడీ క్యారెక్టర్లతో బ్రహ్మికి వైట్ల తిరుగులేని ఇమేజ్ తీసుకొచ్చాడు. వైట్ల సినిమా అంటే బ్రహ్మి ఉండాల్సిందే.. ఆ కామెడీ పేలిపోవాల్సిందే అన్న ముద్ర జనాల్లో పడిపోయింది.

కాకపోతే ఏ కామెడీతో అయితే వైట్ల-బ్రహ్మి కాంబినేషన్ సూపర్ సక్సెస్ అయిందో.. అదే కామెడీ వాళ్లిద్దరినీ ముంచింది. బ్రహ్మిని బకరాను చేసే కామెడీ అంటేనే జనాలకు మొహం మొత్తేసింది. ఫలితంగా ఇద్దరినీ జనాలు తిరస్కరించారు. ఇద్దరి కెరీర్లూ దెబ్బ తిన్నాయి. బ్రహ్మికి బాగా అవకాశాలు తగ్గిపోగా.. వైట్ల కూడా బ్రూస్ లీ తర్వాతి సినిమాకు చాలా గ్యాప్ తీసుకోవాల్సి వచ్చింది. ఆగడు లో బ్రహ్మి క్యారెక్టర్ విషయంలో తీవ్ర విమర్శలు మూటగట్టుకున్నప్పటికీ.. బ్రూస్ లీ లో తన ఫేవరెట్ కమెడియన్ని విడిచిపెట్టని వైట్ల.. ఈసారి మిస్టర్ విషయంలో మాత్రం త్యాగం చేశాడు. బ్రహ్మి లేకుండానే ఈ సినిమాను ముగించాడు. వైట్లలో వచ్చిన గొప్ప మార్పు ఇదే అని చెప్పాలి. ఈ సినిమాలో కథాకథనాలతో పాటు కామెడీ కూడా కొత్తగా ఉంటుందని అంటున్నాడు వైట్ల.

,  ,  ,  ,  ,