Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

02-Jun-2017 12:22:14
facebook Twitter Googleplus
Photo

అల్లు అర్జున్ లేటెస్ట్ మూవీ డీజే సాంగ్స్.. యూట్యూబ్ సెన్సేషన్స్ కంటిన్యూ చేస్తూనే ఉన్నాయి. ఒకవైపు నార్త్ లో సరైనోడు హిందీ డబ్బింగ్ మూవీతో.. మరోవైపు సౌత్ లో దువ్వాడ జగన్నాధం సాంగ్స్ తో ఒకేసారి ఇరగదీసేస్తున్నాడు అల్లు అర్జున్.

రీసెంట్ గా రిలీజ్ అయిన 'అస్మైక యోగ.. తస్మైక భోగ.. రస్మైక రాగ హిందోళం' పాట యూట్యూబ్ లో సెన్సేషన్స్ సృష్టిస్తూ.. టాప్ ట్రెండింగ్ అయిపోయింది. అయితే.. ఈ పాటలో ఉపయోగించిన పదజాలంతో మనోభావాలు దెబ్బ తిన్నాయంటున్నారు బ్రాహ్మణ సామాజిక వర్గానికి కొందరు ప్రతినిధులు. ఇప్పటికే దువ్వాడ జగన్నాధంపై నిరసన తెలుపడమే కాకుండా.. సెన్సార్ బోర్డ్ కు ఫిర్యాదు కూడా చేశారు. రాత పూర్వకంగా ఈ ఫిర్యాదు చేయడం గమనించాల్సిన విషయం. డీజే మూవీపై కఠినమైన చర్యలు తీసుకోవాలని.. అభ్యంతరకర పదాలను తొలగించి తీరాల్సిందేనని పట్టుపడుతున్నారు.

మరోవైపు దువ్వాడ జగన్నాధం షూటింగ్ చివరి దశకు చేరుకుంది. ఒకవైపు పాటలను రిలీజ్ చేస్తూ.. ప్రమోషన్స్ చేస్తూనే.. మరోవైపు షూటింగ్ ఫినిషింగ్ టచెస్ ఇచ్చేస్తున్నారు. దిల్ రాజు నిర్మించిన డీజే-దువ్వాడ జగన్నాధం మూవీని.. ఈ నెల 23న రిలీజ్ చేయనున్నారు.

,  ,  ,  ,  ,