Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

09-Jun-2017 12:22:13
facebook Twitter Googleplus
Photo

మామూలుగా ఒక్క సినిమా ఫ్లాపైతే.. స్టార్ హీరోలు కూడా తరువాత సినిమాను చేయడానికి చాలా టైమ్ తీసుకుంటున్నారు. సంవత్సరం గ్యాప్ ఇచ్చేసి కాని తరువాత సినిమాతో రావట్లేదు. ఇక ఎవరైనా యంగ్ హీరోలకైతే.. మరీ ముఖ్యంగా ఏ బ్యాగ్రౌండ్ లేని హీరోలకైతే.. ఒక సినిమా ఫ్లాపైందంటే అంతే సంగతులు. తరువాత ప్రాజెక్టు సెట్టవ్వడానికి చాలా టైమ్ పడుతుంది. కాని ఈ కుర్రాడి విషయంలో మాత్రం అలా జరగట్లేదు.

భారీ బడ్జెట్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్ గా మారాడు బెల్లంకొండ శ్రీనివాస్. మనోడు ఇంతవరకు సరైన మార్కెట్ అనేది సెట్ చేసుకోలేదు కాని.. మినిమం 30 కోట్లకు తగ్గకుండా తన సినిమా బడ్జెట్ మాత్రం ఉంటోంది. డెబ్యూ సినిమా అల్లుడు శీను.. ఆ తరువాత వచ్చిన స్పీడున్నోడు.. ఇప్పుడు బోయపాటి శ్రీను డైరక్షన్లో వస్తున్న సినిమా.. అన్నీ కూడా హెవీ బడ్జెట్ తో రూపొందుతున్నవే. ఇక త్వరలోనే శ్రీవాస్ డైరక్షన్లో అభిషేక్ పిక్చర్స్ వారు మరో పెద్ద సినిమా ఇతగాడితో చేస్తున్నారు. ఈ సినిమాలన్నింటిలోనూ కోట్లలో వసూలు చేస్తున్న హీరోయిన్లు కూడా చేయడం గమనార్హం. సమంత.. తమన్నా.. రకుల్.. ప్రగ్యా జైస్వాల్.. ఇప్పుడు పూజా హెగ్డే.. అది మనోడి రేంజ్. ఇంకా మార్కెట్ లేదు.. జనాల్లో ఆదరణ ఉందో లేదో తెలియదు.. సినిమా మీద ఎంత పెడితే ఎంత తీయగలమో క్లారిటీ లేదు.. అయినా కూడా ఈ కుర్రాడి మీద ఇంత ఇన్వెస్టుమెంట్ ఎందుకు పెడుతున్నారు బాసూ?

నిజానికి ఫ్యామిలీ బ్యాగ్రౌండ్ ఉన్న అఖిల్.. అల్లు శిరీష్ వంటి హీరోలకు.. వారు ఫ్లాపులు కొట్టినా కూడా.. ఒక్కసారి కంటెంట్ బాగుంటే ఎలాగో ప్రీ డిఫైన్డ్ గా తమ ఫ్యామిలీల అభిమానులు ఉన్నారు కాబట్టి.. వర్కవుట్ అవుతుందని అనుకోవచ్చు. కాని బెల్లంకొండ శ్రీనివాస్ పరిస్థితి అలా కాదు

,  ,  ,  ,  ,