Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

07-May-2015 11:34:31
facebook Twitter Googleplus
Photo

కథానాయకులు ఎప్పుడూ సినిమా షూటింగుల నిమిత్తం వివిధ దేశాలు తిరుగుతూనే వుంటారు. అయితే సరదాగా ఫ్యామిలీతో కలిసి వెళ్లినప్పుడు కలిగే ఆనందం వేరు .. అనుభూతి వేరు. అందువల్లనే అవకాశం చిక్కినప్పుడు వాళ్లు తమ కుటుంబంతో కలిసి ఆనందంగా గడపడానికి విదేశాలకి ప్రయాణం కడుతుంటారు. అలాగే బన్నీ కూడా త్వరలో తన ఫ్యామిలీతో కలిసి 'బ్రిటన్' కి బయలుదేరనున్నాడు. దాదాపు మూడువారాల పాటు ఫ్యామిలీతో అక్కడ జాలీగా గడపనున్నట్టు తెలుస్తోంది.

సన్నాఫ్ సత్యమూర్తి ఇటు తెలుగులోనూ .. అటు మలయాళంలోను అందించిన సక్సెస్ బన్నీకి ఎంతో సంతోషాన్ని కలిగించింది. ఇక రుద్రమదేవిలో తాను చేస్తోన్న పాత్రకి ఆయన డబ్బింగ్ చెప్పుకునే పని కూడా పూర్తయింది. దాంతో కాస్త మానసిక ఉల్లాసం అవసరమని భావించిన ఆయన బ్రిటన్ ట్రిప్ కి ప్లాన్ చేసుకున్నాడు. అక్కడి నుంచి తిరిగి వచ్చిన తరువాత, బోయపాటితో ఆయన సినిమా షూటింగ్ మొదలవుతుంది.

,  ,  ,  ,