Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

19-Jun-2015 11:44:00
facebook Twitter Googleplus
Photo

కేథరిన్ ట్రెసా .. తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమే. కన్నడ .. మలయాళ చిత్రాలతో అక్కడి ఆడియన్స్ మనసు దోచుకున్న కేథరిన్, ఆ తరువాత తెలుగు .. తమిళ చిత్రాలపై దృష్టి పెట్టింది. కథానాయిక లక్షణాలు పుష్కలంగా ఉండటంతో అమ్మడికి ఇక్కడ అవకాశాలు బాగానే వచ్చాయి. కానీ వాటి నుంచి ఆశించిన సక్సెస్ లే రాలేదు. దాంతో ఇక్కడి పోటీలో నిలదొక్కుకునే ప్రయత్నం చేస్తూనే, తమిళ్ పై మరింత శ్రద్ధ పెట్టింది.

ఫలితంగా శింబూ సినిమాలో ఒక కథానాయికగా అవకాశాన్ని దక్కించుకుంది. సెల్వ రాఘవన్ దర్శకుడిగా వ్యవహరిస్తోన్న ఆ సినిమా పేరే 'కాన్'. వైవిధ్యభరితమైన పాత్రను పోషిస్తోన్న శింబూ సరసన మరో కథానాయికగా తాప్సీ నటిస్తోంది. తమిళ ప్రేక్షకులు తెల్లగా .. బొద్దుగా వుండే నాయికలను ఆదరిస్తారు. అందువలన కేథరిన్ ఇక్కడ తన స్థానాన్ని పదిలపరచుకుంటుందేమో చూడాలి.

,  ,  ,  ,  ,