Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

02-Sep-2015 18:06:12
facebook Twitter Googleplus
Photo

నిన్న మధ్యాహ్నం నుంచి టాలీవుడ్ సంభ్రమాశ్చర్యాలకు లోనవుతోంది. తెలుగులో ఇలాంటి సినిమానా అని ఒకటే చర్చ. ?కంచె? ట్రైలర్ మన సెలబ్రెటీలకు నిజంగానే మతి పోగొట్టింది. ట్విట్టర్ లో ఈ ట్రైలర్ పై చాలా మంది సెలబ్రెటీలు స్పందించారు. వాళ్లేమన్నారో చూడండి.

??చాలా బాగుంది. ఈ సినిమా తీయడానికి ఎంత పరిశోధన కష్టం అవసరమో అంచనా వేయగలను. కంచె టీంకి ఆల్ ద బెస్ట్??
-రాజమౌళి

??కంచె ట్రైలర్ స్టన్నింగ్ గా ఉంది. మొత్తం టీంకి ఆల్ ద బెస్ట్??
-మహేష్ బాబు

??నా ఫ్రెండ్ క్రిష్ నా కజిన్ వరుణ్ తేజ్ కలిసి కొత్త తరం తెలుగు సినిమా అందిస్తున్నారు. ట్రైలర్ నాకు నచ్చింది. మీకూ నచ్చుతుందని ఆశిస్తున్నా??
-అల్లు అర్జున్

??ఒకే తరహా సినిమాల నుంచి బయటపడి తెలుగు సినిమా ఎదుగుతున్నందుకు చాలా సంతోషంగా ఉంది. డైరెక్టర్ క్రిష్ హీరో వరుణ్ లకు కంగ్రాట్స్??
-రామ్ గోపాల్ వర్మ

??కంచె ట్రైలర్ నాకు భలే నచ్చింది. వరుణ్ తేజ్ స్టన్నింగ్ క్రిష్ కు కంగ్రాచులేషన్స్??
-సాయిధరమ్ తేజ్

??కంచె ట్రైలర్ చూసి పడిపోయా. క్రిష్ నుంచి మరో ల్యాండ్ మార్క్ ఫిలిం. నిన్ను చూసి గర్విస్తున్నా మచ్చా??
-అల్లరి నరేష్

??అక్టోబరు 2 వరకు ఆగలేకున్నా. వార్ అండ్ లవ్. పర్ఫెక్ట్ సెటప్??
-మంచు లక్ష్మి

??డైరెక్టర్ క్రిష్ తనదైన శైలిలో యునీక్ ట్రేడ్ మార్క్ సినిమాతో వస్తున్నాడు??
-తాప్సి

??మైండ్ బ్లోయింగ్ అంటే ఇదేనన్నమాట. క్రిష్.. నమ్మశక్యంగా లేదు. వరుణ్ తేజ్ టెర్రిఫిక్ గా ఉన్నాడు??
-దేవిశ్రీ ప్రసాద్

??హాలీవుడ్ రేంజిలో ఉంది కంచె ట్రైలర్. క్రిష్.. నువ్వు సాధించావ్. వరుణ్ తేజ్ టూ హాట్. అతణ్ని హ్యాండిల్ చేయడం కష్టం. మిమ్మల్ని చూసి గర్విస్తున్నా??
-ఛార్మి

??క్రిష్ సినిమా కంచె ట్రైలర్ చూశాక ఒకే ఒక్క మాట చెప్పగలను.. స్టన్నింగ్??
-తరణ్ ఆదర్శ్ బాలీవుడ్ ట్రేడ్ అనలిస్ట్

,  ,  ,