Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

08-Aug-2015 10:47:21
facebook Twitter Googleplus
Photo

తన జీవితంలో మర్చిపోలేని రోజుల్లో ఒకటని.. తానీ రోజును మర్చిపోలేనని చెప్పిన ప్రిన్స్ మహేశ్ బాబుకు మాటకు తగ్గట్టే.. ఈ శుక్రవారం సాగుతోంది. రెండు వరుస ఫ్లాప్ ల తర్వాత విడుదలైన శ్రీమంతుడి మీద మహేశ్ చాలానే నమ్మకం పెట్టుకున్నారు. సహ నిర్మాతగా వ్యవహరించిన ఆయన.. ఈ చిత్రం కోసం ఎప్పుడూ లేని విధంగా బయటకు వచ్చి ప్రచారం చేశారు.

మీడియాతో చాలానే సమయాన్ని గడిపారు. శ్రీమంతుడి సినిమా మీద క్రేజ్ పెంచారు. ఇదంతా ఒక ఎత్తు అయితే.. మీడియా ద్వారా.. శ్రీమంతుడు గురించి ఆయనేం చెప్పారో.. అంతకంటే.. మిన్నంగా సిల్వర్ స్క్రీన్ మీద ఉండటం.. దీనికి మీడియా నుంచే కాదు.. సర్వత్రా పాజిటివ్ టాక్ రావటం తెలిసిందే.

సామాన్య ప్రేక్షకుల నుంచి టాలీవుడ్ ప్రముఖుల వరకూ ప్రతి ఒక్కరూ అభినందనలు తెలుపుతున్నారు. రికార్డు వసూళ్లతో టాలీవుడ్ సత్తా చాటిన బాహుబలి దర్శకుడు రాజమౌళి.. మహేశ్ బాబుకు అభినందనలు తెలిపారు. ఇక.. తమ తొలి సినిమాతో బ్లాక్ బస్టర్ సినిమాలో విజయం సాధించినందుకు అభినందనలని నిర్మాత అనిల్ సుంకర చెప్పారు.

మహేశ్ కు అభినందనలు తెలిపిన వారిలో విలక్షణ నటుడు ప్రకాశ్ రాజ్ ప్రశంసించటమే కాదు.. చాలామంచి రిపోర్టులు వస్తున్నాయని.. తన ఫ్రెండ్ కి మహేశ్ బాబుకు అభినందనలన్నారు. శ్రీమంతుడికి మంచి టాక్ వచ్చిందని.. ఇది బ్లాక్ బస్టర్ అవుతుందని అందరూ చెబుతున్నారంటూ మహేశ్ అన్న నరేష్ ట్వీట్ చేస్తే..నిఖిల్.. సుధీర్ బాబు.. రాహుల్.. రవీంద్రన్.. ప్రదీప్.. గోపీ మోహన్ తదితరులంతా శ్రీమంతుడు మీద అభినందనలు కురిపిస్తున్నారు.

,  ,  ,