Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

22-Apr-2015 10:24:08
facebook Twitter Googleplus
Photo

టెంపర్ సినిమాతో అనూహ్యమైన విజయాన్ని అక్కున చేర్చుకున్న ఎన్టీఆర్, ఆ తరువాత సినిమాల విషయంలో ఆచి తూచి వ్యవహరిస్తున్నాడని అంటున్నారు. ఆయన కథానాయకుడిగా సుకుమార్ దర్శకత్వంలో ఒక సినిమా రూపొందుతోంది. ఈ సినిమాకి 'నాన్నకి ప్రేమతో' అనే టైటిల్ పెట్టనున్నట్టు ప్రచారం జరిగింది. అయితే తాజాగా అందిన సమాచారం ప్రకారం ఈ సినిమా టైటిల్ లో చిన్న మార్పు చేయనున్నట్టు తెలుస్తోంది. 'మా నాన్నకి ప్రేమతో' అనేది టైటిల్ గా ఉంటుందని అంటున్నారు. గతంలో ఎన్టీఆర్ కి విజయాలను దూరం చేసిన చిత్రాలలో 'నా' అక్షరంతో మొదలైనవి వున్నాయి.
ఆ సెంటిమెంట్ ను దృష్టిలో పెట్టుకుని, నాన్నకి ప్రేమతో టైటిల్ కి ముందు కొత్తగా 'మా' చేర్చినట్టు చెబుతున్నారు. కాబట్టి ఈ సినిమా టైటిల్ 'మా నాన్నకి ప్రేమతో' కానుంది. మే 1 నుంచి లండన్ లో షూటింగ్ జరుపుకోనున్న ఈ సినిమాలో, ఎన్టీఆర్ జోడీగా రకుల్ ప్రీత్ సింగ్ అలరించనుంది. కథ .. కథనాలనే కాదు, ఎన్టీఆర్ ని కూడా ఈ సినిమాలో సుకుమార్ కొత్తగా చూపించనున్నాడని అంటున్నారు. దాంతో ఈ సినిమా షూటింగు వివరాలను ... విశేషాలను ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి అభిమానులు సిద్ధమైపోతున్నారు.

,  ,  ,  ,  ,  ,  ,  ,