Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

16-May-2015 11:37:51
facebook Twitter Googleplus
Photo

ఫలానా కాంబినేషన్లో ఒక సినిమా రానుందనే ఎనౌన్స్ మెంట్ జరగ్గానే టైటిల్ విషయంలో ప్రేక్షకులు ఆసక్తిని కనబరుస్తుంటారు. ఈ నేపథ్యంలో ఫలానా టైటిల్ ని పరిశీలిస్తున్నామని దర్శక నిర్మాతలు చెబుతూ ఉండటంతో, దానిని వర్కింగ్ టైటిల్ చేసుకుని ఆ సినిమాకి సంబంధించిన విశేషాలు వెలువడుతుంటాయి. అయితే ఒక్కోసారి ముందుగా అనుకున్న టైటిల్ ని కాదని .. తర్వాత మార్చిన సందర్భాలు లేకపోలేదు. తాజాగా రామ్ చరణ్ .. శ్రీను వైట్ల కాంబినేషన్లో రూపొందుతోన్న సినిమా టైటిల్ విషయం కూడా అయోమయానికి గురిచేస్తోంది. ఈ సినిమాకి 'బ్రూస్ లీ' అనే టైటిల్ ఖరారు కావొచ్చనే వార్తలు షికారు చేస్తున్నాయి.
ఇప్పటి వరకూ ఈ సినిమాకి వర్కింగ్ టైటిల్ గా 'మై నేమ్ ఈజ్ రాజు' ఉంటూ వచ్చింది. ఈ సినిమాలో చరణ్ స్టంట్ మాన్ పాత్రలో కనిపించనున్నాడు. సాధారణంగా తన సినిమాలకి డూప్ లేకుండా ఫైట్ చేసే చరణ్ .. ఇందులో సినిమా హీరోలకి డూప్ గా ఫైట్ సీన్స్ లో పాల్గొనేవాడిగా కనిపిస్తాడు. అందువలన ఈ సినిమాకి 'బ్రూస్ లీ' టైటిల్ సరైనదిగా సినిమా యూనిట్ భావిస్తోన్నట్టు ప్రచారం జరుగుతోంది. సాధారణ ప్రేక్షకులకు ఈ టైటిల్ అంతగా కనెక్ట్ కాదు గనుక ఈ టైటిల్ ని ఖరారు చేయకపోవచ్చనే వాళ్లు లేకపోలేదు.

,  ,  ,  ,  ,  ,  ,