Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

21-Mar-2017 16:20:15
facebook Twitter Googleplus
Photo

మణిరత్నం కొత్త సినిమా వచ్చేస్తోంది. తమిళ్ లో కాట్రు వెలియిదాయ్ అనే పేరుతో రూపొందిన ఈ చిత్రం.. తెలుగులో చెలియా అనే టైటిల్ పై రూపొందింది. తెలుగు వెర్షన్ కి నిర్మాత దిల్ రాజు కాగా.. కార్తి-అదితి రావు హైదరిల జంట ఇప్పటికే అందరినీ ఆకర్షిస్తోంది. ఏప్రిల్ 7న విడుదల కానున్న ఈ చిత్రానికి.. ఇప్పుడు ప్రమోషన్స్ చేస్తున్నారు.

ఇప్పటికే ఓ ట్రైలర్ ఇచ్చిన మణిరత్నం.. ఇప్పుడు మరో ట్రైలర్ విడుదల చేసి ఆశ్చర్యపరిచారు. ఈ సారి కంప్లీట్ గా హీరో యాంగిల్ నుంచి నడిచేలా ట్రైలర్ ను కట్ చేయడం విశేషం. చెలియా చిత్రంలో హీరో ఓ ఎయిర్ ఫోర్స్ అధికారి కాగా.. మంచు కొండల్లో మొదలు పెట్టిన ట్రైలర్ లోని ప్రతీ విజువల్ ఆకట్టుకుంటోంది. రొమాన్స్ కి దేశభక్తిని మిక్స్ చేసి సినిమాలు తీయడంలో బోలెడంత అనుభవం ఉన్న మణి సార్.. మరోసారి అలాంటి ప్రయత్నమే చేస్తున్నారనే విషయం తెలిసిపోతోంది.

హీరో కార్తిని రెండు మూడు గెటప్స్ లో చూపించి ఆసక్తిని మరింతగా పెంచేశారు. పైగా ఓ గెటప్ లో అయితే.. ఓ టెర్రరిస్ట్ గెటప్ లో కార్తి కనిపిస్తున్నాడు. మరోవైపు అదితిరావుతో చేసిన రొమాన్స్.. హీరోయిన్ కి చెప్పిన డైలాగ్స్ క్యూట్ అండ్ క్యాచీగా ఉన్నాయి.

,  ,  ,  ,  ,