Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

01-Nov-2016 10:51:06
facebook Twitter Googleplus
Photo

చిరంజీవి నటిస్తున్న 150వ సినిమా షూటింగ్ శరవేగంగా సాగిపోతుంది. ఇటీవల దీపావళి పండుగకు విడుదల చేసిన ఫస్ట్ లుక్ సినిమా క్యాప్షన్ కి తగ్గట్టే బాస్ ఈజ్ బ్యాక్ అనిపిస్తున్నాయి. వినాయక్ దర్శకత్వంలో ప్రస్తుతం క్లైమాక్స్ మినహా టాకీ పార్ట్ ని పూర్తిచేసుకుంది. త్వరలో మొత్తాన్ని ముగించి పాటల చిత్రీకరణకై సిద్ధపడుతుంది.

అయితే తాజా సమాచారం ప్రకారం సినిమాలో ఒక పాత చిత్రీకరణ తెలుగు తెరకు కొత్తగా కనిపించే ప్రదేశంలో తెరకెక్కించనున్నట్టు సమాచారం. ప్రకృతి అందించిన వరంగా భావించే "టన్నెల్ ఆఫ్ లవ్" అనే ప్రదేశంలో ఒక పాట చిత్రీకరణ జరగనున్నట్టు తెలుస్తుంది. ఇటీవలే ఈ ప్రదేశంలో శంకర్ - రజనిల 2.0 షూటింగ్ జరుపుకున్న సంగతి తెలిసినదే.

ఉక్రెయిన్ లో ఒకానొక రైల్వే స్టేషన్ గా నిలిచిన ఈ ప్రదేశం అద్భుతానికి పరాకాష్టగా నిలుస్తుంది. ఇటువంటి ప్రదేశంలో ఒక తెలుగు సినిమా షూటింగ్ జరపడం చూస్తుంటే మెగాస్టార్ ఎక్కడా రాజీ పడట్లేదని అర్ధమవుతుంది. 2.0 కంటే ముందే ఖైదీ నంబర్ 150 విడుదలవుతుంది గాబట్టి ముందుగా చిరు సినిమాలోనే ఈ అద్భుతాన్ని చూసే అవకాశాలున్నాయన్నమాట.

,  ,  ,  ,  ,